CBN : చంద్రబాబు కు ఘనస్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు
రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన చంద్రబాబు..శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు
- Author : Sudheer
Date : 05-07-2024 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
4 వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) లో తెలుగు తమ్ముళ్లు (Telugu Brothers) ఘన స్వాగతం పలికారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో..చంద్రబాబు భేటీ కాబోతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబదించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ఇరు సీఎంలు చర్చించనున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఢిల్లీ లో బిజీ బిజీ గా గడిపిన చంద్రబాబు..శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ అభిమానులు , పార్టీ శ్రేణులు బాబు కు ఘనస్వాగతం పలికారు.బేగం పేట్ నుండి జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
రోడ్డు పొడుగూతా అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ వచ్చారు. ఓ పక్క జోరు వర్షం పడుతున్న కార్యకర్తలు , అభిమానులు మాత్రం అలాగే ర్యాలీగా వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చీ స్వాగతం పలికారు. మరోపక్క హైదరాబాద్ అంత కూడా పసుపుమయం చేసారు. భారీగా ప్లెక్సీ లు , కటౌట్ లు ఏర్పాటు చేసి బాబు ఫై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ రేంజ్ లో ప్లెక్సీ లు , కట్ఔట్స్ ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం ఈ రేంజ్ లో బాబు కు గ్రాండ్ వెల్ కామ్ చెప్పడం జరిగింది.
Read Also : Raj Tarun : రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని వదిలేసాడు – లావణ్య