Raj Tarun : రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని వదిలేసాడు – లావణ్య
ర్సింగ్ కు చెందిన లావణ్య అనే యువతీ..రాజ్ తరుణ్ ఫై కేసు పెట్టింది
- Author : Sudheer
Date : 05-07-2024 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వివాదంలో చిక్కుకున్నాడు. షార్ట్స్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించిన రాజ్..ఆ తర్వాత ఉయ్యాలా జంపాల మూవీ తో వెండితెర కు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న తరుణ్..ఆ తర్వాత వరుస హిట్ల తో అతి తక్కువ టైంలోనే బిజీ హీరో అయ్యాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపికలో తప్పటడుగు వేసి వరుస ప్లాప్స్ మూటకట్టుకున్నాడు. గత కొద్దీ రోజులుగా హిట్ అనేది లేకుండా అయిపోయింది. ఇక రాజ్ తరుణ్ పని అయిపోయినట్లే అనుకుంటున్నా సమయంలో ఇప్పుడు ఓ వివాదం ఆయన్ను వైరల్ గా మార్చింది. నర్సింగ్ కు చెందిన లావణ్య అనే యువతీ..రాజ్ తరుణ్ ఫై కేసు పెట్టింది. రాజ్ తరుణ్ తనను శారీరకంగా వాడుకున్నాడని , పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని..ఇప్పుడు మరో హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని, తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది.
We’re now on WhatsApp. Click to Join.
లావణ్య పిర్యాదు ఫై రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్య తో కొంతకాలం రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవమే అని..కానీ ఆ తర్వాత ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని , అలాగే మరో వ్యక్తి తో రిలేషన్ షిప్ లో ఉందని తెలిసి ఆమెను దూరం పెట్టానని తెలిపాడు. ఇక మరో హీరోయిన్ తో నేను గడుపుతున్న అనే మాటల్లో నిజం లేదని..నేను ఎవరితో రిలేషన్షిప్ లో లేనని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు లావణ్య చేసిన మోసానికి అసలు జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానని తెలిపాడు రాజ్. మరి వీరిద్దరి మాటల్లో ఎవరి మాటలు నిజం అనేది పోలీసులు తేల్చబోతున్నారు.
Read Also : Heavy Rain in Hyd : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం