New Railway Line : తెలంగాణలో కొత్త రైల్వే లైను.. ఏ రూట్‌లో తెలుసా ?
New Railway Line : తెలంగాణవాసులకు మరో గుడ్ న్యూస్. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.
- By Pasha Published Date - 09:24 AM, Tue - 26 March 24

New Railway Line : తెలంగాణవాసులకు మరో గుడ్ న్యూస్. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్‌సీఆర్) గతేడాది మంజూరుకు ప్రతిపాదించిన డోర్నకల్-గద్వాల రైలు మార్గానికి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. ఈ లైన్ కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూత్పూర్ తదితర ప్రధాన ప్రాంతాలను రైలు వసతితో కనెక్ట్ చేస్తుంది. దీని (New Railway Line) నిర్మాణానికి అవసరమైన తుది సర్వే మార్కింగ్ పనులు ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని మోతె మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం మీదుగా మోతె మండలంలోని కొత్తగూడెం మీదుగా సర్వే పనులు సాగుతున్నాయి. ఇప్పటికే మోతె మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లి సహా పలు గ్రామాల వద్ద రహదారి పాసింగ్‌లను గుర్తించి సర్వే బృందం మార్కింగ్ చేసింది ఈ రైలు మార్గానికి ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వే కోసం గతేడాది దక్షిణ మధ్య రైల్వే రూ.7.40 కోట్లు మంజూరు చేసింది. దాదాపు 296 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను నిర్మాణానికి రూ.5330 కోట్ల వ్యయంతో అంచనాలను రెడీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు నెట్‌వర్క్ ఎక్కడ ఉందో తెలుసా? మీరు కాలినడకన దాటగలిగే అతి చిన్న రైల్వే లైన్ వాటికన్ సిటీలో ఉంది. ఈ రైలు మార్గం పొడవు 300 మీటర్లు మాత్రమే. మీరు దాదాపు 2 నిమిషాల్లో కాలినడకన ఈ దూరాన్ని హాయిగా దాటుతారు. వాస్తవానికి ఈ రైల్వే ట్రాక్‌పై ప్యాసింజర్ రైళ్ల కోసం కాదు. ఇది గూడ్స్ రైళ్ల కోసం మాత్రమే నిర్మించారు. ఈ దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. దీని పేరు సిట్టా వాటికానా. ఈ రైలు మార్గాన్ని 1934లో ప్రారంభించారు. వాటికన్ సిటీలో ఉన్న ఈ రైల్వే లైన్ 300 మీటర్ల తర్వాత ఇటలీలోని రోమా శాన్ పియట్రో రైల్వే స్టేషన్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే, 2015 సంవత్సరంలో మొదటిసారిగా సిట్టా వాటికానో రైల్వే స్టేషన్ నుండి ప్యాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ఈ రైలు ఇటలీలోని క్యాజిల్ గాండోల్ఫోకు వెళ్లేది. అలాగే శనివారాల్లో మాత్రమే నడిచేది. అయితే ఈ ట్రాక్‌పై ఎక్కువగా సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడుస్తాయి.
Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్‌తో ప్రణీత్ టీమ్ సొంత దందా.. అమెరికా నుంచి ఆ ఫోన్ కాల్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అమెరికా, చైనా, రష్యా, భారతదేశాలలో ఉంది. అమెరికా 2.5 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. చైనా 1 లక్ష కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రష్యా 85 వేల 500 కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్‌ను కలిగి ఉండగా, భారతదేశం 65 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.