HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Womens Panel Faults Members For Tying Rakhi To Ktr Issues Notices

Rakhi To KTR: రాఖీకి కూడా భయపడితే ఎలా?.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

త‌న‌కు రాఖీ క‌ట్టిన మ‌హిళ‌ల‌కు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్యాప్షన్ ఇచ్చారు.

  • Author : Gopi Date : 24-08-2024 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rakhi To KTR
This is not people's rule.. Revenge rule: KTR

Rakhi To KTR: తెలంగాణ‌లో రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారం కాంగ్రెస్ పార్టీపై ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన బీఆర్ఎస్ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. ప్ర‌తి ప‌థకంలో త‌ప్పులు ఉన్నాయంటూ చెబుతుంది. దీనికి కాంగ్రెస్ సైతం త‌గ్గ‌టంలేదు. అందుకు త‌గ్గ‌ట్టుగానే కౌంట‌ర్లు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలో వ‌స్తే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం అమలు చేస్తామ‌ని చెప్పిన విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. చెప్పిన విధంగానే సీఎం రేవంత్ నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం అమ‌లు చేసింది.

అయితే ఇటీవ‌ల ఈ ప‌థకంపై అలాగే అందులో ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Rakhi To KTR) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై ఓ రెండు రోజుల‌పాటు రాష్ట్రంలోని మ‌హిళా లోకం అంతా కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు కురిపించారు. అంతేకాకుండా ఈ విష‌యాన్ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ సైతం సిరీయ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే కేటీఆర్‌కు నోటిసులు పంపింది. మ‌హిళ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టానికి గ‌ల కార‌ణాల‌ను క‌మిష‌న్ ముంద‌ట హాజ‌రై చెప్పాల‌ని తెలిపింది.

Also Read: Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

రాఖీకి కూడా భయపడితే ఎలా? pic.twitter.com/6H2Pk7afu2

— KTR (@KTRBRS) August 24, 2024

అయితే ఇటీవ‌ల రాజ‌కీయ బిజీ షెడ్యూల్ వ‌ల‌న కేటీఆర్ మ‌హిళా క‌మిష‌న్ ముందు హాజరుకాలేక‌పోయారు. తాజాగా ఆయ‌న ఈరోజు ఉదయం మ‌హిళ‌ల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మిష‌న్ ముందు హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే తాను కావాల‌ని చేసిన వ్యాఖ్య‌లు కావని, మ‌హిళ‌లంటే తనుకు ఎంతో గౌర‌వ‌మ‌ని కేటీఆర్ క‌మిష‌న్ విచార‌ణ అనంత‌రం మీడియాతో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే స‌మ‌యంలో ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయింది. అదే కేటీఆర్‌కు మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులు రాఖీ క‌ట్టడం.

సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ అయిందో లేదో రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది ప్ర‌భుత్వం. దీనిపై కేటీఆర్ తాజాగా త‌న ఎక్స్ ఖాతాలో స్పందించారు. త‌న‌కు రాఖీ క‌ట్టిన మ‌హిళ‌ల‌కు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆయ‌న డైరెక్ట్‌గానే కౌంట‌ర్ ఇచ్చార‌ని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • hyderabad
  • ktr
  • Sharada Nerella
  • telangana
  • Telangana Women's Commission

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd