HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana State Governance Is In The Hands Of Bjp Not Congress Harish Rao

TG Govt : తెలంగాణ రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో కాదు బీజేపీ చేతుల్లో ఉంది – హరీష్ రావు

TG Govt : గోదావరి-బనకచర్ల అంశాన్ని మాత్రమే అజెండాగా పెట్టి చర్చకు రావడం తాము సమర్థించమని, ఈ విషయాన్ని కేంద్రానికి ముందుగానే స్పష్టంగా తెలియజేశామని వెల్లడించారు.

  • Author : Sudheer Date : 16-07-2025 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Warning
Harish Rao Warning

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం నిర్వహించిన సమావేశానికి రేవంత్ హాజరైన తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒకవైపు సమావేశాన్ని బహిష్కరిస్తామంటూ లీకులు ఇవ్వడం, మరోవైపు అర్ధరాత్రి చీకటి ఒప్పందాలతో ఢిల్లీకి పరుగెత్తుకెళ్లడం ఎంత దుర్మార్గమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు.

Jeep Compass: భార‌త మార్కెట్లోకి కొత్త కారులు.. కొన్ని రోజులే ఛాన్స్‌!

బనకచర్ల అంశం అజెండాలో లేదన్న రేవంత్ వ్యాఖ్యలు అబద్దమని, కేంద్ర ప్రభుత్వ అజెండాలో మొట్టమొదటి అంశంగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఉన్నదని గుర్తు చేశారు. ఒకవైపు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్లపై చర్చ జరిగిందంటూ ప్రకటిస్తే, రేవంత్ మాత్రం అసత్యాలు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజన చట్టం, జీఆర్ఎంబీ, అపెక్స్ కమిటీ అనుమతులు లేకుండా బనకచర్ల ప్రీ-ఫీజబులిటీ రిపోర్టు తిరస్కరించబడిన తరుణంలో, కమిటీకి ఒప్పుకోవడం తెలంగాణను మోసం చేసినట్టు అవుతుందని చెప్పారు.

రాష్ట్ర పాలన కాంగ్రెస్ చేతుల్లో లేదు, బీజేపీ రిమోట్ కంట్రోల్‌లో నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనపై చంద్రబాబు, బీజేపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడని రేవంత్, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారుగా నియమించడం దారుణమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ ఏర్పాట్లపై కూడా కాంగ్రెస్ అబద్ధ ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Seven Spiritual Cities : జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఏడు మోక్షదాయక క్షేత్రాలు.. పునర్జన్మ నుంచి విముక్తి మార్గం ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం!

నీటి వివాదాలపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, మేడిగడ్డ, జూరాల, సుంకిశాల వంటి ప్రాజెక్టుల బద్వలతలను గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించామని, కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని, ఈ ద్రోహానికి రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “నీళ్ల విషయంలో నిజాయితీ ఉండాలి. లేకపోతే ప్రజలు నీళ్లలో ముంచుతారు” అని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Banakacharla Project
  • CM Chandrababu
  • CM Revanth Reddy
  • harish rao
  • TG Govt

Related News

Harish Rao Pm

KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Cm Revanth Mptc Zptc

    Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

Latest News

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

  • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd