Deeksha Vijay Diwas : తెలంగాణ చరిత్రలో “నవంబర్ 29” లేకపోతే “డిసెంబర్ 9” ప్రకటన వచ్చేదే కాదు : కేటీఆర్
“దీక్షా విజయ్ దివస్”(Deeksha Vijay Diwas) సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, లక్షలాది గులాబీ సైనికులందరికీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- By Pasha Published Date - 10:33 AM, Mon - 9 December 24

Deeksha Vijay Diwas : ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ‘దీక్షా విజయ్ దివస్’ను జరుపుకుంటోంది. కేసీఆర్ నిరాహార దీక్షకు స్పందించిన ఆనాటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2009 డిసెంబరు 9న ప్రకటన విడుదల చేసింది. అందుకే ఈ తేదీన ‘దీక్షా విజయ్ దివస్’ను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు
స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు” కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ”
అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి..
దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజుతెలంగాణ చరిత్రలో..
“నవంబర్ 29” లేకపోతే..
“డిసెంబర్ 9” ప్రకటన లేదు..
ఈ కీలక మలుపు… pic.twitter.com/GLN4TAFUYv— KTR (@KTRBRS) December 9, 2024
Also Read :MLC Kavitha : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు : ఎమ్మెల్సీ కవిత
‘‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’’ అని ప్రకటించి తెలంగాణ ప్రజల బంగారు భవిష్యత్తు కోసం చావునోట్లో తలపెట్టిన ధీరుడు కేసీఆర్ అని కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు డిసెంబరు 9 అని ఆయన చెప్పారు. తెలంగాణ చరిత్రలో “నవంబర్ 29” అనేది లేకపోతే “డిసెంబర్ 9” ప్రకటనే ఉండేది కాదన్నారు. ఒకవేళ డిసెంబరు 9 ప్రకటనే లేకపోతే “జూన్ 2” గెలుపు లేనే లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘దగాపడ్డ తెలంగాణ గడ్డ విముక్తి కోసం ఉద్యమ సారథిగా కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమై, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోశారు’’ అని ఆయన గుర్తు చేశారు. “దీక్షా విజయ్ దివస్”(Deeksha Vijay Diwas) సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, లక్షలాది గులాబీ సైనికులందరికీ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇది మహోజ్వల తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు’’ అని కేటీఆర్ అభివర్ణించారు.