Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం ముహూర్తం ఖరారు..?
తెలంగాణ నూతన సచివాలయ భవన (Telangana Secretariat) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. MLC ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆగిపోయిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి కొత్త ముహూర్తం ఖరారైంది.
- Author : Gopichand
Date : 14-02-2023 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ నూతన సచివాలయ భవన (Telangana Secretariat) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. MLC ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆగిపోయిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి కొత్త ముహూర్తం ఖరారైంది. సీఎం కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 17న సచివాలయాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే MLC ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా వేశారు.
Also Read: Gold And Silver Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!
తాజాగా ప్రభుత్వం మరో ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌లను ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలుస్తోంది.