PECET : తెలంగాణ పీఈ సెట్ షెడ్యూల్ విడుదల
మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
- By Latha Suma Published Date - 04:02 PM, Thu - 6 February 25
PECET : తెలంగాణలో పీఈ సెట్,ఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. పీఈ సెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ వర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
