Thalliki Vandanam Scheme : ‘తల్లికి వందనం’పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Thalliki Vandanam : ముఖ్యంగా "తల్లికి వందనం" పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 03:48 PM, Thu - 6 February 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో 21 అంశాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా “తల్లికి వందనం” పథకాన్ని (Thalliki Vandanam Scheme) వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో తల్లుల అభివృద్ధి మరియు వారి సంక్షేమానికి దోహదం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. నిన్న కమిన్స్, నేడు హేజిల్‌వుడ్!
అలాగే మత్స్యకార భరోసా పథకాన్ని ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం కోసం విధివిధానాలు రూపొందించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇక వచ్చే 3 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి పథకాల గురించి అవగాహన పెంచాలని మంత్రులకు , ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను మంత్రులు స్వీకరించాలని ఆయన సూచించారు. అలాగే మద్యం దుకాణాల మార్జిన్ ను 10.5% నుంచి 14% పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
ఎంఎస్ఎంఈ, ఎంఈడీపీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాలలో సవరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు మరియు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆధారంగా ఆమోదం పొందిన రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, తిరుమల తిరుపతి దేవస్థానం కార్మికుల పోస్టులు, తమ్మినపట్నం – కొత్తపట్నం ప్రాంతంలోని ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి వంటి కీలక అంశాలపై కూడా కేబినెట్ చర్చలు జరిపింది.