Alert : తెలంగాణలో ZPTC, MPTC షెడ్యూల్ విడుదల
Alert : తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
- By Kavya Krishna Published Date - 12:16 PM, Sun - 31 August 25

Alert :తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 10వ తేదీలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల తుది జాబితా, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించాలని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముసాయిదా జాబితా ప్రకారం, సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను ప్రచురించాలని, ఆ తర్వాత సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించాలని సూచించింది.
11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైరల్!
ఈ ప్రక్రియలో భాగంగా, సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం, సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులను పరిష్కరించిన తర్వాత, సెప్టెంబర్ 10న తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ముద్రించి ప్రచురించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ ద్వారా రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయనే సంకేతాలు స్పష్టమయ్యాయి.
Chutney For Kidney: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే!