Minister Mallareddy : చంద్రబాబుకు మద్దతుగా మరోసారి వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి.. దేశంలోనే బెస్ట్ సీఎం..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మరోసారి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను
- Author : Prasad
Date : 14-10-2023 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మరోసారి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్న వ్యక్తిని జైలులో పెడతారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏం పాపం చేశారని జైల్లో పెట్టారంటూ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎవరినీ మోసం చేయలేదని.. ఎఫ్ఐఆర్‌లో బాబు పేరు లేదన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై తొలుత మౌనంగా ఉన్న తరువాత బహిరంగంగానే ఖండిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో 35 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు డీహైడ్రేషన్, స్కిల్ అలర్జీ రావడంతో ఆయన అస్వస్థతకు గురైయ్యారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి పై ఏసీబీ కోర్టులో బాబు తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయమూర్తి చంద్రబాబు ఉన్న రూమ్‌లో టవర్ ఏసీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డాక్టర్లు నివేదిక పేర్కొన్న సూచనలను పాటించాలని జైలు అధికారులను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
Also Read: Rahul Gandhi: ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య: రాహుల్ గాంధీ