HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Minister Ktr Says Boston Is An American City That Will Work With Hyderabad

KTR: భాగ్యనగరంలో ‘బోస్టన్’ పెట్టుబడులు!

హైదరాబాద్ నగరంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది.

  • By Hashtag U Published Date - 10:58 AM, Fri - 25 March 22
  • daily-hunt
Ktr
Ktr

హైదరాబాద్ నగరంతో కలిసి పనిచేసేందుకు అమెరికాలోని బోస్టన్ నగరం ముందుకు వచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ ఇవాళ(శుక్రవారం) మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈమేరకు బోస్టన్ లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance అనే సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కి అమెరికాలోని బోస్టన్ నగరానికి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ మాదిరి ఇక్కడ సైతం అనేక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాలకు చెందిన అనేక కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవకాశాలను పరిశీలించడంతో పాటు, లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఈ రంగంలో అనేక నూతన పరిశోధనలు ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. హెల్త్ రికార్డుల డిజిటలీకరణ కొనసాగుతుందని… తద్వారా ఇక్కడి సిటిజన్లకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ముఖ్యంగా కరోన సంక్షోభ సమయంలో ఈ డిజిటల్ హెల్త్ రికార్డుల వలన వేగంగా వారికి చికిత్స అందించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఇరు నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాల వలన భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కే. తారకరామారావు తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రెండు జిల్లాలో పౌరుల యొక్క హెల్త్ రికార్డ్ లని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ సైన్సెస్ రంగంలోని సైంటిస్ట్ లతో పాటు ఐటి, టెక్ రంగాల డాటా సైంటిస్టుల చేస్తున్న ఉమ్మడి కృషి వలన రానున్న రోజుల్లో అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత వలన సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, ఆయా రంగాలకు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా బయో, లైఫ్ సైన్సెస్ రంగాల్లో టెక్నాలజీకి పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ లాంటి కంపెనీల కార్యకలాపాలను ఉదహరించి, హైదరాబాద్ నగరంలో ఉన్న అవకాశాలను వివరించారు. బోస్టన్ నగరంలోని నిర్వాణ లైఫ్ కేర్ లో జరిగిన ఈ సమావేశంలో నిర్వాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్ కేర్ ఛైర్పర్సన్ జాన్ స్కల్లి, సీఈఓ రవి ఐక, శశి వల్లిపల్లి లు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగంలో చేపడుతున్న కార్యక్రమాలకు అమెరికాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా పేరు ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టిందని, అందులో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, పాలసీ పరమైన నిర్ణయాలు, ఇన్నోవేషన్ కి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫండ్ ను ఏర్పాటు చేయడం, జీనోమ్ వ్యాలీ లో ప్రత్యేకంగా ఒక ఇంకుబేటర్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుందని, వీటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ బయో లైఫ్ సైన్సెస్ ఫార్మా ఉత్పత్తులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • telangana
  • Telangana Minister KTR
  • USA

Related News

Flight Delay Passengers Pro

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

Shamshabad Airport: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, శివమొగ్గ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో

  • Nuclear Testing

    Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Maganti Sunitha

    Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

Latest News

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

  • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd