HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Liberation Day The Occasion Is The Same The Celebrations Are Different

Telangana Liberation Day : సందర్భం ఒకటే.. సంబరాలు వేరు

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలో (Telangana) అధికారపక్షంతో సహా అన్ని పక్షాలూ వేరువేరు సభలలో వేరు వేరు రకాలుగా ఉత్సవాలు జరిపారు.

  • By Hashtag U Published Date - 12:18 PM, Mon - 18 September 23
  • daily-hunt
Telangana Liberation Day
Telangana Liberation Day

By: డా. ప్రసాదమూర్తి

Telangana Liberation Day Celebrations : సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలో అధికారపక్షంతో సహా అన్ని పక్షాలూ వేరువేరు సభలలో వేరు వేరు రకాలుగా ఉత్సవాలు జరిపారు. నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ సెప్టెంబర్ 17, 1948న భారత ప్రభుత్వంలో విలీనమైంది. ఇది ఏదో నామమాత్రంగా కేవలం ఒక తేదీని గుర్తుచేసే నేపథ్యం కాదు. తెలంగాణలో నైజాం పాలనలో, రజాకార్ల భూస్వాముల దొరల నిరంకుశ పాదాల కింద నలిగిపోయిన సామాన్య ప్రజలు, అణగారిన రైతులు నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపారు. వేలమంది రక్తతర్పణ సాగించిన ఆ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు.

అంతకుముందు ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ వంటి సంస్థల ప్రేరణ కూడా ఈ ఉద్యమానికి ఉంది. శతాబ్దాలుగా బానిస బంధాలలో చీకటి బతుకులు కొనసాగించిన అసహాయ రైతులు, సామాన్య ప్రజలు అసామాన్య పోరాటం చేసిన ఫలితంగానే నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది, భారత ప్రభుత్వంలో భాగమైంది. ఈ సందర్భంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా చెల్లాచెదురయ్యారు. వేలాదిగా కటకటాల పాలయ్యారు. దశాబ్దాల తరబడి కేసులలో ఇరుక్కుని జీవితమంతా కోర్టుల చుట్టూ తిరిగారు. ఎన్నో బలిదానాలు.. ఎన్నో త్యాగాలు.. ఎన్నో అల్లకల్లోలాలు విధ్వంసాల నేపథ్యం తెలంగాణ (Telangana) ఆవిర్భావానికి ఉంది. దీన్ని ఎవరు ఎలా జరిపినా తమ తమ పార్టీల ఎజెండాల అనుకూలంగా ఈ చారిత్రక నేపథ్యాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించడం చారిత్రక నేరమే అవుతుంది.

17వ తేదీన హైదరాబాదులో నాలుగు ప్రధాన పక్షాలు ఈ చారిత్రక నేపథ్యాన్ని ఎలా తలుచుకున్నాయో ఒకసారి చూద్దాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నవారు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రధాని మోడీ చేసిన సంకల్పం అద్భుతమైనదని ఈ సందర్భంగా అమిత్ షా ప్రధానిపై ప్రశంసలు వర్షం కురిపించారు.

ఇదే సందర్భంగా తెలంగాణలో (Telangana) ఒకప్పుడు రజాకార్లకు నియంతత్వ పాదాల కింద ప్రజలు ఎలా నలిగిపోయారో గుర్తు చేసుకున్నారు గాని, ఆనాడు ప్రజలు తుపాకులు పట్టి ఎవరి నాయకత్వంలో తిరగబడ్డారో.. ఆ కమ్యూనిస్టు నాయకత్వాన్ని పేరుకైనా ఆయన ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా ఆయన ఆర్య సమాజ్ హిందూ మహాసభ వంటి సంస్థల పేర్లు ప్రస్తావించారు. సర్దార్ పటేల్, కేఎం మున్షి వంటి వారు లేకపోతే తెలంగాణ విముక్తి చెందేది కాదని కూడాఅన్నారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావించారు. అంతే తప్ప ఆనాటి సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల ప్రస్తావన ఆయన తీసుకురాలేదు.

ఇదే సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ వారు జరిపిన విజయభేరి సభలో పేరుకైనా తెలంగాణ విమోచన (Telangana Liberation) నేపథ్యాన్ని ప్రస్తావించలేదు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే తాము 6 ముఖ్యమైన పథకాలను అమలు చేస్తామని ఇవి కేవలం వాగ్దానం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ కల ఎలా అయితే సాకారం చేశామో, అలాగే ఈ ఆరు ముఖ్యమైన పథకాలను కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, విద్యా భరోసా యువ వికాసం పథకం, చేయూత పథకం ఇలా ఆరు పథకాలలో ఏ పథకం కింద ఏమేమి పనులు చేస్తారో వాటిని వివరించడానికి కాంగ్రెస్ వారు ఈ సందర్భంగా పెట్టిన బహిరంగ సభను వేదిక చేసుకున్నారు. మీరు కూడా ఎక్కడా తెలంగాణ ప్రాంతం సెప్టెంబర్ 17 తేదీతో ఎలాంటి చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉందో మచ్చుకైనా ముచ్చటించలేదు.

మరోపక్క పాలక బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన బహిరంగ సభ పెట్టింది. దీనికి జాతీయ సమగ్రతా దినోత్సవం అని పేరు కూడా పెట్టింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తమ పాలనలో తెలంగాణ ప్రజలకు చేకూరిన లాభాలు వల్లెవేసి, తాము రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నామో వాటినే ప్రస్తావించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి 1,226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి తాము చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాదు, ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం దాన్ని అనుసరిస్తుంది’ అని గొప్ప నినాదాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చారు. ఆయన కూడా ఎక్కడా సెప్టెంబర్ 17వ తేదీతో తెలంగాణకు ఏవిధంగా చారిత్రక ప్రాధాన్యత ఉన్నదో.. ఏ చీకటి నుంచి ఏ వెలుగులోకి రావడానికి ఎంత రక్త తర్పణ జరిగిందో.. నైజాం పాలన నాటి ఆ నియంత్రత్వపు రోజుల్ని, ఆనాడు తిరగబడిన ప్రజల ధైర్య సాహసాలను ఆయన కూడా ఒక్క మాట మాత్రం గానైనా ప్రస్తావించలేదు.

ఇలా తెలంగాణ కోటి రత్నాల వీణగా ఆవిర్భవించి తన ఉనికిని చాటుకొని అస్తిత్వ పోరాటంలో అనన్య పటిమను ప్రదర్శించిన చరిత్రను అంతా నేతలు పక్కన పెట్టి, సెప్టెంబర్ 17వ తేదీన తమ తమ పార్టీల సొంత ఎజెండాల సంబరంగా మార్చి ఉత్సవాలు జరుపుకున్నారు. పోతే తెలంగాణ ప్రాంత విముక్తికి, ఇక్కడ జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి ప్రాణాలర్పించి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీల వారసత్వంగా సిపిఐ, సిపిఎం మాత్రం ఒక వారం రోజులపాటు సభలు నిర్వహించి సెప్టెంబర్ 17వ తేదీన ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఇలా మొత్తానికి సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో ఉత్సవాలయితే జరిగాయి గాని, అవి పార్టీల ఉత్సవాలు గానే మిగిలాయి. సెప్టెంబర్ 17వ తేదీకి ఉన్న చారిత్రక నేపథ్యం మరుగున పడిపోయింది.

Also Read:  All Party Meet: టీడీపీ అఖిలపక్ష సమావేశం.. జగన్ పై 38 క్రిమినల్ కేసులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • hyderabad
  • Liberation Day
  • telangana

Related News

A New Chapter On The World

Telangana Rising 2047 : ప్రపంచ వేదికపై సరికొత్త అధ్యాయం

Telangana Rising 2047 : ఒకప్పుడు కేవలం ఒక ప్రాంతీయ ఆకాంక్షగా చూసిన తెలంగాణ, నేడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది

  • Telangana Global Summit Vis

    Global Summit 2025 : రెండు రోజులకు సంబదించిన పూర్తి షెడ్యూల్ ఇదే !!

  • Telangana Global Summit 202

    Telangana Rising Global Summit 2025: సమ్మిట్‌ లో ఏం చర్చించనున్నారంటే?

  • Telangana Rising Global Sum

    Telangana Rising Global Summit : ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న గ్లోబల్ సమ్మిట్‌

  • Putin Dinner

    Putin Dinner: పుతిన్ విందుపై రాజకీయ దుమారం.. ఆ విష‌యంపై కాంగ్రెస్ అభ్యంతరం!

Latest News

  • Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!

  • IndiGo Flight Disruptions : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎటుచూసినా సూట్కేసుల కుప్పలే !!

  • Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?

  • Kidneys Care : ఆల్కహాల్ కాదు.. కిడ్నీలను డ్యామేజ్ చేసే మరో డేంజర్ డ్రింక్!

  • Grama Panchayat Elections : ఇంటింటికీ ఫ్రీ వైఫై సర్పంచ్ అభ్యర్థి హామీ

Trending News

    • Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!

    • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

    • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd