All Party Meet: టీడీపీ అఖిలపక్ష సమావేశం.. జగన్ పై 38 క్రిమినల్ కేసులు
తెలుగుదేశం పార్టీ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేసిన అంశాన్ని లేవనెత్తడంతో పాటు,
- By Praveen Aluthuru Published Date - 06:29 AM, Mon - 18 September 23

All Party Meet: తెలుగుదేశం పార్టీ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేసిన అంశాన్ని లేవనెత్తడంతో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు. ఐదు రోజుల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ సమావేశం జరిగింది.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి 38 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, గత తొమ్మిదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని, రాజకీయ నాయకులకు సంబంధించిన క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8న ఆయనను కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల పాటు రిమాండ్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
Also Read: Diabetes Tips: నిద్రకు ముందు ఈ నాలుగు పనులు చేస్తే చాలు డయాబెటిస్ కంట్రోల్లో ఉండటం ఖాయం?