HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Kabaddi Funds Scam Allegations

Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌‌లో రూ.1.20 కోట్లు మాయం..

Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.60 లక్షలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • Author : Kavya Krishna Date : 01-06-2025 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Funds Misuse
Funds Misuse

Money Golmal: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో నిధుల గోల్‌మాల్ అంశం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.60 లక్షలను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కోసం కేటాయించిన నిధుల్లోనూ రూ.1.20 కోట్లు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సురేశ్, కోశాధికారి శ్రీరాములుపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీరాములుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సాట్స్ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా, అసోసియేషన్‌కు అధికారిక ఖాతా ఉన్నప్పటికీ, మరో అనధికారిక ఖాతా నుంచి రూ.60 లక్షలను విత్‌డ్రా చేసినట్లు ఆరోపించారు.

2021లో సూర్యాపేటలో జరిగిన జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీకి కేటాయించిన రూ.1.20 కోట్లు వృథా చేశారని, అందులో రూ.50 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని సురేశ్ తన ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ కోసం ఒక స్వచ్ఛంద సంస్థ అందించిన రూ.20 లక్షలను జిల్లా సంఘాలకు ఇవ్వకుండా శ్రీరాములే సొంతంగా వాడుకున్నారని ఆరోపించారు. ఏజీఎం (Annual General Meeting), ఈసీ (Executive Committee) సమావేశాలు నిర్వహించకుండానే నిధుల విషయంలో శ్రీరాములు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సురేశ్ మండిపడ్డారు.

నిధుల దుర్వినియోగంపై జగదీశ్వర్ యాదవ్ తో పాటు శ్రీరాములును ప్రశ్నించినందుకు, తనను బెదిరించి మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ నుంచి తొలగించారని సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ డిమాండ్ చేశారు. ఈ నిధుల గోల్‌మాల్ ఆరోపణలపై పోలీసులు చేపట్టే దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?

TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abids Police
  • Financial Fraud
  • Funds Misuse
  • Junior National Kabaddi Tournament
  • kabaddi
  • Sports Corruption
  • Sriramulu
  • Suresh
  • telangana
  • TKA

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd