8000 Jobs : అంగన్వాడీ కేంద్రాలలో 8వేల జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
8000 Jobs : త్వరలోనే తెలంగాణలో మరో భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
- Author : Pasha
Date : 29-09-2023 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
8000 Jobs : త్వరలోనే తెలంగాణలో మరో భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. రాష్ట్ర సర్కారు దాదాపు 3వేలకు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్తగా 8వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 31,711 ఉండగా.. మినీ అంగన్వాడీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. ఒక్కో ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు ఒక హెల్పర్ ఉంటారు. అదే మినీ కేంద్రాల్లోనైతే ఒకే టీచర్ ఉంటారు. హెల్పర్ ఉండరు. ఇటీవల మినీ అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశారు. దీంతో అక్కడ కూడా హెల్పర్ పోస్టులను భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర సర్కారు.. కేంద్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖకు ఈ అప్ గ్రేడ్ వివరాలను పంపించింది.
Also read : Mob Attack – CM House : మణిపూర్ లో టెన్షన్.. సీఎం పూర్వీకుల ఇంటిపై మూక దాడి !
మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతోపాటు వాటికి కేంద్ర సర్కారు నుంచి వచ్చే గ్రాంట్ అమౌంట్ సైతం పెరుగుతుది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కొత్తగా హెల్పర్ల నియామకానికి మార్గం సుగమం అవుతుంది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారిన మినీ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన 3,989 హెల్పర్ పోస్టులతో పాటు పెండింగ్ లో ఉన్న ఇతరత్రా పోస్టులు మరో 4వేల దాకా ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ కలుపుకొని అంగన్ వాడీల్లో 8వేల జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా (8000 Jobs) వేస్తున్నారు.
WE AE ON WHATSAPP CHANNEL: FOLLOW US