Liquor Sales : మద్యం అమ్మకాల్లో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ
Liquor Sales : భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారట
- By Sudheer Published Date - 01:53 PM, Sat - 15 February 25

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మద్యం అమ్మకాల (Liquor Sales) గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దీని బట్టి చెప్పొచ్చు రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఏ రేంజ్ లో సాగుతుందో. మాములు రోజుల్లోనే భారీగా మద్యం అమ్మకాలు కొనసాగుతాయి. ఇక పండగల సీజన్లు , న్యూ ఇయర్ (New Year) సందర్భాల్లో అయితే ట్రిపుల్ అమ్మకాలు సాగుతాయి. ఇదే విషయాన్నీ కేంద్రమంత్రి చెప్పుకొచ్చాడు.
Rashmika Mandanna : తల్లి పాత్రకు సై అంటున్న రష్మిక
రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి. తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారని తెలిపాడు. కాకపోతే గతంకంటే ఈ సంఖ్య కాస్త తగ్గిందని చెప్పడం కొసమెరుపు. రాజ్యసభలో ఎదురైనా ప్రశ్నకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియపటేల్ సమాధానం ఇస్తూ.. భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 ప్రకారం.. ఏపీలో 34.9శాతం మంది, తెలంగాణలో 53.8శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. అయితే, 2019-21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఏపీలో 31.2శాతం, తెలంగాణలో 50శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే తెలంగాణ మద్యం అమ్మకాల్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని తెలిపారు.