Rashmika Mandanna : తల్లి పాత్రకు సై అంటున్న రష్మిక
Rashmika Mandanna : తనకు కథ నచ్చితే ఇద్దరు పిల్లల తల్లిగానైనా నటించడానికి సిద్ధమని రష్మిక స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది
- Author : Sudheer
Date : 15-02-2025 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..తాజాగా ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj ) జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’ (Chhaava) తో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ , ఆయన భార్యగా రష్మిక (Rashmika Mandanna) ఈ మూవీ లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేసాడు.
Vallabhaneni Vamsi Remand : నా భర్తను టార్చర్ పెడుతున్నారు – వంశీ భార్య ఆవేదన
ఈ మూవీ లో సంభాజీ భార్యగా రష్మిక మందన్న మరోసారి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్‌లో జీవించారనే చెప్పాలి. ఆమె ఫెర్ఫార్మెన్స్ నేషనల్ క్రష్ ట్యాగ్‌ను మించి ఉందనే చెప్పాలి. ఇక ఔరంగజేబ్ కూతురు జీనత్ ఉన్నీసా బేగంగా డయానా పెంటీ తన కళ్లతోని.. క్రూరమైన హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకొన్నది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా మరోసారి అత్యంత భారమైన పాత్రలో మెప్పించాడు. మిగితా పాత్రల్లో నటించిన ప్రతీ ఒక్కరు ఆ పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకొని జీవించారనే ఫీలింగ్ కల్పించారు. ఓవరాల్ గా ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడం తో రష్మిక ఫుల్ హ్యాపీ గా ఉంది.
ఈ సక్సెస్ క్రమంలో తనకు కథ నచ్చితే ఇద్దరు పిల్లల తల్లిగానైనా నటించడానికి సిద్ధమని రష్మిక స్టేట్మెంట్ ఇచ్చి షాక్ ఇచ్చింది . ‘నేను నటించే సినిమాలో ఏం చేస్తున్నాననేదానితో నాకు సంబంధం లేదు. కథ నన్ను ఆకట్టుకుంటే చాలు. బామ్మ పాత్ర అయినా, ఇద్దరు పిల్లల తల్లిగా నటించడానికైనా నేను సిద్ధం. నేను అనుకోకుండా ఎంచుకున్న సినిమాలే ప్రేక్షకుల్ని మెప్పించాయి’ అని ఆమె తెలిపింది. ఈమె మాటలు విన్న అభిమానులు సైతం ఒకింత షాక్ కు గురయ్యారు.