Group 2 New Dates : గ్రూప్-2 ఎగ్జామ్స్ కొత్త తేదీలు ఇవే..
Group 2 New Dates : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి.
- By Pasha Published Date - 06:57 AM, Wed - 11 October 23
Group 2 New Dates : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. వాస్తవానికి ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలను.. ప్రిపరేషన్ కు టైమ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో నవంబరుకు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ ను వాయిదా వేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మొత్తం 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలవగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను(Group 2 New Dates) భర్తీ చేయనున్నారు.
Also read : Honey Benefits: ఈ సీజనల్ వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం.. తేనెతో కలిగే లాభాలు ఇవే..!
Related News
TS : ఇకపై జీన్స్ టీషర్ట్సు బంద్..ఆర్టీసీ కీలక నిర్ణయం
TSRTC: ఇక మీదట ఆర్టీసీ ఉద్యోగులు(RTC employees) జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అ�