HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Group 2 Exam Schedule Released

Group 2 Exam : తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటనను జారీ చేసింది. ఉదయం పది నుంచి 12.30 వరకు మొదటి పేపర్‌ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి నుంచి ఐదు వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.

  • Author : Latha Suma Date : 22-08-2024 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Group-2 Exam Schedule Released
Telangana Group-2 Exam Schedule Released

Telangana Group 2 Exam Schedule : తెలంగాణలో గ్రూప్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటనను జారీ చేసింది. ఉదయం పది నుంచి 12.30 వరకు మొదటి పేపర్‌ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి నుంచి ఐదు వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

.డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
.డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
.డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
.డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

కాగా, కొద్దిరోజుల కింద డీఎస్సీ పరీక్షలతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2ను వాయిదా వేసి డీఎస్సీని మాత్రం వాయిదా వేయలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్‌ 7, 8 తేదీల్లోనే గ్రూప్2 పరీక్షలు జరగాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ… గ్రూప్ 2 నిర్వహణ కోసం కొత్త తేదీలను వెల్లడించింది.

మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత గతేడాది ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది కమిషన్.

Read Also: DNA Report : వైద్యురాలిపై అఘాయిత్యం కేసు.. కీలకంగా డీఎన్ఏ రిపోర్టు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Telangana Group 2 Exam Schedule
  • TGPSC
  • TS Group 2

Related News

Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విద్యావంతులకు సరిపోయే అద్భుతమైన ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 19 ‘సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్’ (బీజ ధృవీకరణ అధికారి) పోస్టుల భర్తీ ప్రక్రియకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్త

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd