HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Govt Plan To Install Ex Cm Konijeti Rosaiah Statue

Konijeti Rosaiah Statue : హైదరాబాద్లో రోశయ్య విగ్రహం – రేవంత్ ప్రకటన

Konijeti Rosaiah Statue : రోశయ్యకు నగరంలో విగ్రహం లేకపోవడం లోటుగా కనిపిస్తోందని, ఆయన నాలుగో వర్ధంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు

  • By Sudheer Published Date - 03:23 PM, Wed - 4 December 24
  • daily-hunt
Rosaiah Statue
Rosaiah Statue

గతంలో సీఎంగా ఎవరున్నా, నంబర్ 2 మాత్రం రోశయ్య దేనని .. హైదరాబాద్ హైటెక్స్లో రోశయ్య వర్ధంతి కార్యక్రమం(3rd Anniversary Commemoration Of Konijeti Rosaiah)లో రేవంత్ న్నారు. రోశయ్యకు నగరంలో విగ్రహం లేకపోవడం లోటుగా కనిపిస్తోందని, ఆయన నాలుగో వర్ధంతి నాటికి విగ్రహాన్ని (Ex CM Konijeti Rosaiah Statue) ఏర్పాటు చేస్తామని రేవంత్ (CM Revanth ) తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు రోశయ్య ప్రధాన పాత్ర పోషించిన రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన రోశయ్య గారు ప్రజల జీవనశైలిని మార్చే విధంగా పనిచేసారు. ప్రభుత్వంతో పాటు ప్రజల మధ్య మంచి సంబంధాన్ని నెలకొల్పడంలో ఆయన పాత్ర గణనీయమైంది. ఇప్పుడు ఆయనకు సరికొత్త స్మారకంగా ఒక విగ్రహం ప్రతిష్టించడం అనేది ప్రతి ఒక్కరికీ గౌరవం చూపినట్లే అవుతుందని సీఎం రేవంత్ అన్నారు. రోశయ్య ఆర్థిక క్రమశిక్షణ వల్లే తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడింది. రోశయ్య 16 సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరింత అవగాహన పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని 2007లోనే ఆయన నాకు సూచించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించాలని, పాలకపక్షంలో ఉంటే పరిష్కరించాలని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తేనే పాలక పక్షాలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. కానీ చట్టసభల్లో నేడు ఆ స్ఫూర్తి కొరవడింది. ప్రశ్నించే వారిని మాట్లాడనివ్వద్దనే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

రోశయ్య ఆనాడు ప్రభుత్వాలను కంచవేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్-2గా మాత్రం ఎప్పుడూ రోశయ్యనే ఉండేవారు. నంబర్ వన్ స్థానంలో ఉన్న వారిని జరిపి అందులో కూర్చోవాలని ఆయన ఏనాడు తాపత్రయపడలేదు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే సమయం వచ్చినప్పుడు ఆయన్ను సీఎం చేసింది. రోశయ్యకు ఉన్న నిబద్ధతే అన్ని పదవులు, హోదాలనూ ఆయన ఇంటికి తెచ్చిపెట్టింది. రాజకీయాలలో ఆర్యవైశ్యులకు తగిన స్థానం ఇస్తాం అని తెలిపారు.

కొణిజేటి రోశయ్య (1923 – 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వ ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రముఖ వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులలో ఒకరు. తన రాజకీయ జీవితంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపై అద్భుతమైన పట్టు కలిగి ఉండటంతో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. జూలై 4, 1923, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని వేమూరు గ్రామంలో రోశయ్య జన్మించారు. : విద్యార్జన పూర్తయిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించారు. 1968లో తొలి సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టి సరికొత్త రికార్డు ను సృష్టించారు. ఆర్థిక, రవాణా, విద్య, ఆరోగ్య శాఖల్లో మంత్రిగా పని చేశారు. 2009లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, క్రమశిక్షణతో పార్టీని ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న నేతగా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2011 నుండి 2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. డిసెంబర్ 04, 2021న చెన్నైలో కన్నుమూశారు. నేటికీ ఆయన మరణించి మూడేళ్లు గడుస్తుంది.

Read Also : Railway Tickets : రూ.100 రైల్వే టికెట్‌లో రూ.46 మేమే భరిస్తున్నాం : రైల్వే మంత్రి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd Anniversary Commemoration Of Konijeti Rosaiah
  • CM Revanth Reddy
  • hyderabad
  • Konijeti Rosaiah
  • Konijeti Rosaiah Statue
  • Telangana Govt Plan

Related News

Godavari Water Hyd

Godavari : హైదరాబాద్ కు ‘గోదావరి’.. శంకుస్థాపన చేయబోతున్న సీఎం రేవంత్

Godavari : హైదరాబాద్ నగర దాహాన్ని తీర్చేందుకు గోదావరి జలాలను (Godavari Water) తీసుకురావాలనే లక్ష్యంతో 'గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్' ఫేజ్-2, 3లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు

  • Ganesh Laddu Ru99

    Ganesh Laddu : రూ.99కే 333 కేజీల లడ్డూను దక్కించుకున్న అదృష్టవంతుడు

  • MMTS Trains

    MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Police Seized Drugs

    Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd