HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Governor Tamilisai Full Speech In Assembly

Governor Tamilisai Speech : ఇది ప్రజా ప్రభుత్వం.. నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు

తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai)... గత ప్రభుత్వం ఫై ఉన్న కోపాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు.

  • By Sudheer Published Date - 01:09 PM, Fri - 15 December 23
  • daily-hunt
Governor Tamilisai Speech in Assembly
Governor Speech

తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai)… గత ప్రభుత్వం ఫై ఉన్న కోపాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. ఇది ప్రజా ప్రభుత్వం.. నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారంటూ బిఆర్ఎస్ ఫై విమర్శలు..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ప్రశంసలు కురిపించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly Session) భాగంగా రాజు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan ) ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గవర్నర్ మాట్లాడడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారో అని యావత్ ప్రజలు , పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూసారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండ హామీలు నెరవేరుస్తామని తెలిపారు. ఇక ఇప్పుడు కాగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ప్రకటించిన హామీల ఫై గవర్నర్ ఏమంటారో ..ముఖ్యంగా రూ.4వేల పెన్షన్‌, రైతుల రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ వంటి వాటిపై గవర్నర్ ఏమంటారో అనేది ఉత్కంఠ నెలకొని ఉండే..కానీ గవర్నర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫై ప్రసంశలు కురిపించి ఆకట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అణచివేత, అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరు :

ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై (Tamilisai) శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, మా పాలన దేశానికే ఆదర్శం కాబోతుందని… ప్రజలకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం నెరవేర్చాలని ఆకాంక్షించారు. ‘తమ జీవితాల్లో మార్పు రావాలని తెలంగాణ (Telangana) ప్రజలు కోరుకున్నారు. మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను ప్రజలు సహించరు అని చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్య బద్ధంగా పాలన :

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని… పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు.

దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం :

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్‌ తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్‌ అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం :

మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని గవర్నర్‌ తెలిపారు.

ధరణి స్థానంలో భూమాత పోర్టల్ :

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ‘ధరణి’ పోర్టల్ స్థానంలో అత్యంత పారదర్శకమైన భూమాత పోర్టల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని, అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు గవర్నర్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే, అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి అందిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీపైనా కీలక ప్రకటన చేశారు.

6 నెలల్లో మెగా డీఎస్సీ :

వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే కార్యచరణ ప్రారంభించామన్నారు. ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీకి చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి :

ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అనిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని.. కార్యచరణ రూపొందిస్తామన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ రేపటి (శనివారం) వాయిదా పడింది.

Read Also : AP : జగన్ తొందరపాటును..చంద్రబాబు వాడుకుంటాడా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Congress Govt
  • Governor Tamilisai Speech
  • Telangana Assembly

Related News

Kavitha Comments Harish

Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

Kavitha Vs Harish : హరీశ్ రావు స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత (Kavitha) పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమె ఆరోపణలకు పరోక్షంగా జవాబుగా నిలిచాయి

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • Hyd Real Estate

    HYD Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – హరీష్ రావు

  • Paul Kavitha

    Kavitha : కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా – KA పాల్

Latest News

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd