HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Government Releases Sc Classification Go

TG SC Classification GO : ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్‌-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

  • Author : Latha Suma Date : 14-04-2025 - 11:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana government releases SC classification GO
Telangana government releases SC classification GO

TG SC Classification GO : తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్‌-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్‌-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్‌-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఇక, దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జీఓ విడుదల చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపగా, ఆ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపారు.

మూడు గ్రూపుల విభజన, రిజర్వేషన్లు ఇలా..

.గ్రూప్‌-ఏలో ఉన్న వారికి ఒక్క శాతం రిజర్వేషన్‌

.గ్రూప్‌-బీలో ఉన్న వారికి 9 శాతం రిజర్వేషన్‌

.గ్రూప్‌-సీలో ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనుంది.

మరోవైపు, సీఎం రేవంత్‌ రెడ్డి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్‌ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఉన్నారు.

ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం. యంగ్‌ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నాం. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. రైతు, పేద భూమికి హక్కుపై భరోసా ఇస్తూ భూభారతికి శ్రీకారం చూడుతున్నామని అన్నారు.

Read Also: Gold Price : హమ్మయ్య.. 5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Justice Department
  • telangana govt
  • TG SC Classification GO

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd