Husnabad : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక
Husnabad : హుస్నాబాద్ 100 పడకల ఆస్పత్రి నుండి 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి రూ.82 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారి అయినట్లు తెలిపారు.
- By Latha Suma Published Date - 06:19 PM, Wed - 30 October 24

Minister Ponnam Prabhakar : దీపావళి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానుకను అందించింది. ఈ మేరకు హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ లోని 100 పడుకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక అందించిందన్నారు.
హుస్నాబాద్ 100 పడకల ఆస్పత్రి నుండి 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి రూ.82 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారి అయినట్లు తెలిపారు. హుస్నాబాద్ ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ కు 250 పడకల ఆస్పత్రి రావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక హుస్నాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.