Gaddar Film Awards : ‘గద్దర్’ అవార్డుల ప్రకటన..ఉత్తమ నటుడు అల్లు అర్జున్..
ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన 14 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోంది. మొత్తం 11 విభిన్న కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ అయిన తెలుగు, ఉర్దూ చిత్రాలను మాత్రమే ఈ అవార్డుల కోసం పరిశీలించారు.
- By Latha Suma Published Date - 10:47 AM, Thu - 29 May 25

Gaddar Film Awards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో అందించనున్న ప్రతిష్టాత్మక చలనచిత్ర అవార్డులను ప్రముఖ నటి, ఎమ్మెల్యే జయసుధ జ్యూరీ ఛైర్‌పర్సన్‌గా అధికారికంగా ప్రకటించారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో అవార్డుల వివరాలను వెల్లడించారు. ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన 14 ఏళ్ల విరామం తర్వాత జరుగుతోంది. మొత్తం 11 విభిన్న కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ సెన్సార్ అయిన తెలుగు, ఉర్దూ చిత్రాలను మాత్రమే ఈ అవార్డుల కోసం పరిశీలించారు. ప్రతి ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వనున్నారు. 2024 సంవత్సరానికి చెందిన చిత్రాలకు అన్ని కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు.
Read Also: Jammu and Kashmir : ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల లొంగుబాటు
ఈసారి మొత్తం 1248 నామినేషన్లు అందగా, వాటిలో అర్హత కలిగినవాటిని జ్యూరీ సమగ్రంగా పరిశీలించింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటీమణి లాంటి కీలక విభాగాల్లో అవార్డులతోపాటు, ప్రత్యేక జ్యూరీ ప్రశంస పొందిన 21 మందికి వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా గుర్తింపు ఇస్తూ, వీటికి విశేష ప్రాధాన్యతనిచ్చారు. ఇది తెలంగాణ ప్రభుత్వ చలనచిత్రాలకు అందిస్తున్న ప్రోత్సాహానికి ప్రతీకగా నిలిచింది. అంతేగాక, చలనచిత్ర రంగానికి అపూర్వ సేవలందించిన దిగ్గజాలకు గుర్తింపుగా ఎన్టీఆర్ అవార్డు, పైడి జయరాజ్ అవార్డు, బీఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు, కాంతారావు అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను కూడా ప్రకటించారు. ఈ అవార్డుల ప్రకటనకు సంబందించి త్వరలోనే అధికారిక పురస్కార ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
జ్యూరీ అధ్యక్షురాలిగా జయసుధ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో సరికొత్త శక్తిని వెలికితీసేందుకు ఈ అవార్డులు దోహదపడతాయి. తెలంగాణలోని యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేపట్టింది అని పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా తెలంగాణ రాష్ట్రం తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చే గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. గద్దర్ పేరుతో అవార్డులను ఏర్పాటు చేయడం స్వాతంత్య్ర ఉద్యమం, ప్రజాహిత చిత్రాల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉంచిన గౌరవాన్ని సూచిస్తుంది. చలనచిత్ర ప్రియులు, సినీ వర్గాల్లో ఈ ప్రకటనపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ ఇవే..
కల్కి 2898ఏడీ (మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
పొట్టేల్ (రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
లక్కీ భాస్కర్ (మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
ఉత్తమ నటీనటులు వీళ్లే..
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి- నివేదా థామస్ (35 ఇది చిన్న కాదు)
ఉత్తమ దర్శకుడు- నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: బీమ్స్ (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
ఉత్తమ హాస్యనటులు- సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)
ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), బేబీ హారిక
ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్‌రెడ్డి (గామి)
Read Also: Theaters War : అత్తి సత్యనారాయణ సంచలన ఆరోపణలు