Theaters War : అత్తి సత్యనారాయణ సంచలన ఆరోపణలు
Theaters War : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. టికెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె లెక్కలపై అసంతృప్తితో పాటు, కొత్త సినిమాలు ఓటీటీల్లో వెంటనే
- By Sudheer Published Date - 10:32 AM, Thu - 29 May 25

జనసేన నాయకుడు మరియు సినీ ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ (Atti Satyanarayana) తాజా వ్యాఖ్యలు తెలుగు సినీ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల బంద్ (Theaters Bandh) ప్రతిపాదన తనదేమీ కాదని ఆయన స్పష్టంగా తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన పేరును ఉద్దేశపూర్వకంగా లాగారని, దీనివల్ల తన రాజకీయ భవిష్యత్‌కు దెబ్బతిందని ఆరోపించారు. దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ కలిసి ఈ బంద్ కుట్రను పన్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన వెంటే ఉన్నారని, ఆయన నాయకత్వానికి అడ్డుపడే ఎవరికైనా తగిన శిక్ష పడుతుందంటూ హెచ్చరించారు.
PBKS vs RCB: నేడు పంజాబ్‌తో బెంగళూరు కీలక పోరు.. ఆర్సీబీకి కెప్టెన్సీ ఎవరూ చేస్తారు?
తనపై వస్తున్న ఆరోపణలు దిల్ రాజు కుట్రలో భాగమని పేర్కొంటూ, ఇది పూర్తిగా సినిమాకు సంబంధించిన వ్యవహారమని, జనసేన పార్టీ (Janasena) తనని తప్పుగా అర్థం చేసుకోకూడదని అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో తాను థియేటర్ల బంద్ ప్రతిపాదించలేదని, కానీ దిల్ రాజు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో స్పందించానని, కానీ తనను బలిపశువుగా మార్చారని ఆరోపించారు. దిల్ రాజు సోదరుడిని రక్షించేందుకే తనను అడ్డంగా వాడారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. టికెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె లెక్కలపై అసంతృప్తితో పాటు, కొత్త సినిమాలు ఓటీటీల్లో వెంటనే విడుదలవుతుండటంతో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు బంద్‌కి పిలుపునిచ్చారు. ఈ తీర్పును అత్తి సత్యనారాయణ వద్దని స్పష్టం చేసినప్పటికీ, ఆయనపై జనసేన పార్టీ చర్య తీసుకోవడం మరింత వివాదానికి తావిస్తోంది. థియేటర్ల సమస్యలు పరిష్కారానికి రాజకీయ, సినీ వర్గాల సహకారం అవసరమన్నది అత్తి అభిప్రాయం.