HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Festival Bonalu In Hyderabad From June 30

Telangana Bonalu: బోనాలకు వేళాయే..!

ఈ నెల 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం

  • Author : Balu J Date : 21-06-2022 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bonalu
Bonalu

ఈ నెల 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 30 వ తేదీన నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోల్కొండ కోట వద్ద స్థానిక MLA కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

మన పండుగలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30 వ తేదీన గోల్కొండ, జులై 17 న సికింద్రాబాద్, 24 న హైదరాబాద్ బోనాలు జరుగుతాయని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలో ని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని అన్నారు. బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియామిస్తున్నామని తెలిపారు.

వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా 4 అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని, 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని  నియమించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bonalu
  • festival
  • talasani srinivas yadav
  • telangana

Related News

Revanth Reddy Became A Pois

Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు

Gurukul Hostel Food : తెలంగాణ రాష్ట్రంలోనూ గురుకుల పాఠశాలల్లో నిత్యం విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి అవుతున్నారు

  • PM Modi Serious

    PM Modi Serious: తెలంగాణ బీజేపీ ఎంపీల‌కు ప్ర‌ధాని మోదీ వార్నింగ్‌!

  • Ratan Tata Greenfield Road

    Greenfield Highway Works : తెలంగాణలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రారంభం

  • Prabhakarao Police

    Phone Tapping Case : జూబ్లీహిల్స్ పీఎస్ లో లొంగిపోయిన ప్రభాకర్ రావు

  • Sarpanch Salary

    Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

Latest News

  • BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

  • Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

  • Actor Akhil Viswanath : మలయాళ నటుడు ఆత్మహత్య!

  • Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • Rajinikanth: సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ కార్ల‌ కలెక్షన్ ఇదే!

Trending News

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

    • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

    • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd