HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Congress Chief Revanth Reddy Cant Concentrate On 25 Assembly Segments

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు? ఆ 25 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు?

  • By HashtagU Desk Published Date - 11:22 AM, Sat - 19 March 22
  • daily-hunt
6712
6712

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం హోరెత్తుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మళంగా ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎందుకు దానిని అమలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే.. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ ఛార్జ్ లే లేరు. మరి దీనికి గాంధీభవన్ ఏం సమాధానం చెబుతుంది?

పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోకుండా.. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే గెలిచేస్తామని నమ్ముకుంటే సరికాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఆయన ఆర్థిక లావాదేవీలు, ఏకస్వామ్య ధోరణి, లెక్కలేనితనం గురించి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ చీఫ్ ఎందుకు పార్టీపై ఫోకస్ పెట్టడం లేదు?

దాదాపు 10 చోట్ల పార్టీకి ఇన్ ఛార్జ్ లు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఏమైనా అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను డిసైడ్ చేసేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చెబుతుంది. మరి.. నియోజకవర్గాల్లో పార్టీకి బాధ్యులెవరో కూడా చెప్పలేని పార్టీ.. ముందే అభ్యర్థులను ఎలా నిర్ణయించగలుగుతుంది? ఇలా అయితే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి.. కనీసం రెండోస్థానం కూడా దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంటుంది.

ఖమ్మంలో మధిర, భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ఇక్కడ పార్టీకి ఇన్ ఛార్జ్ లు ఎవరో కూడా కార్యకర్తలకే తెలియడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌, ఆలేరు… ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్‌, మక్తల్‌ లో పార్టీలో ఉన్నవారు టీఆర్ఎస్ లోకి వెళ్లగా.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నవారికి మాత్రం బాధ్యతలు ఇవ్వడం లేదు.

వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, మహబూబాబాద్‌ సీట్ల పరిస్థితి ఏమిటో పార్టీ వర్గాలకే అర్థం కావట్లేదు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నుంచి పాల్వాయి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో, సిరిసిల్లలో ఇదే దుస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లికి కూడా ఇన్ ఛార్జ్ ను పెట్టుకోలేని దుస్థితిలో పార్టీ ఉందా? హైదరాబాద్ లో గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌ సంగతిని చూసినా ఇంతే. పార్టీ పరిస్థితి ఇన్ని ప్రాంతాల్లో ఇంత దయనీయంగా ఉంటే అధిష్టానం ఏం చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • revanth reddy
  • telangana

Related News

KCR appearance before Kaleshwaram Commission postponed

KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

KCR : “కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ప్రధాని మోదీ చెప్పాలి” – అనే మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి

  • Sama Rammohan Reddy

    Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

Latest News

  • SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

  • Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • Domestic Violence : అక్రమ సంబంధం తెలిసిపోయిందని కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

  • New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

  • Monalisa : పూసలపిల్ల తెలుగు సినిమా చేయబోతుందా..? ఆ నిర్మాత అదే ప్లాన్ లో ఉన్నాడా..?

Trending News

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd