HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Revanth Meets Pm Modi Seeks Nod For Hyderabad Metro Expansion Semiconductor Hub

CM Revanth Meets PM Modi: మెట్రో ఫేజ్‌-IIకు అనుమ‌తి ఇవ్వండి.. ప్ర‌ధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్‌!

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు.

  • By Gopichand Published Date - 08:04 PM, Wed - 26 February 25
  • daily-hunt
CM Revanth Meets PM Modi
CM Revanth Meets PM Modi

CM Revanth Meets PM Modi: హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి ఉద్దేశించిన హైద‌రాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Meets PM Modi) విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన అయిదు కారిడార్ల‌ను ప్ర‌తిపాదించామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు వెంట‌నే అనుమ‌తించాల‌ని అభ్య‌ర్థించారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీతో ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రికి తెలియ‌జేశారు. ఆర్ఆర్ఆర్‌కు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న ఉంద‌ని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు.

Also Read: Universal Pension Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశంలో అందరికి పెన్షన్‌..!

ఈ రీజిన‌ల్ రింగ్ రైలు పూర్త‌యితే తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని రైలు మార్గాల‌తో అనుసంధానత (క‌నెక్ట‌విటీ) సుల‌భ‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు.. రీజిన‌ల్ రింగ్ రైలుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పీఎంను సీఎం కోరారు. స‌ముద్ర మార్గం లేని తెలంగాణ‌కు వ‌స్తువుల ఎగుమ‌తులు, దిగుమ‌తులు సులువుగా చేసేందుకు రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో డ్రైపోర్ట్ అవ‌స‌ర‌మ‌ని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని స‌ముద్ర పోర్ట్ ల‌ను క‌లిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

* తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని… రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అన‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌జేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించాల‌ని పీఎంకు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు 61 ఐపీఎస్ కేడ‌ర్ పోస్టులు వ‌చ్చాయ‌ని, 2015లో రివ్యూ త‌ర్వాత మ‌రో 15 పోస్టులు అద‌నంగా వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని పీఎం మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నందున ఇండియా సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అన‌మ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • CM Revanth Meets PM Modi
  • hyderabad metro
  • pm modi
  • Semiconductor Hub
  • telangana

Related News

Telangana Government

Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ‌ ప్రభుత్వం భారీ నజరానా!

మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

  • Pm Modi In Bihar

    PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

  • NIzam

    Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం

  • Liquor Shop

    Liquor Shop: తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగింపు!

  • Telangana Liquor Tenders

    Liquor Tenders : నేటితో ముగియనున్న మద్యం టెండర్ల గడువు

Latest News

  • Virat Kohli: జాతీయ జెండా అంటే కోహ్లీకి ఎంత ఇష్ట‌మో చూడండి.. వీడియో వైర‌ల్‌!

  • IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!

  • LIC : అదానీ కంపెనీల్లో పెట్టుబడులపై ఎల్ఐసీ సంచలనం..!

  • Retirement: వ‌న్డే ఫార్మాట్ రిటైర్మెంట్‌పై కోహ్లీ-రోహిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

  • Rohit Sharma: వ‌న్డే క్రికెట్‌లో 33వ సెంచ‌రీ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. మొత్తం 50 శ‌త‌కాలు!

Trending News

    • Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!

    • Janhvi Kapoor : బాలీవుడ్‌లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్

    • Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?

    • Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!

    • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd