HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Kcr New Sketch To Fight With Bjp In Ground Level

CM KCR: ఢిల్లీ మే సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్

  • Author : HashtagU Desk Date : 21-03-2022 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
67
67

తెలంగాణలో మళ్లీ ధాన్యం రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడవ్వడంతో టీఆర్ఎస్ రాజకీయంగా ఓ అడుగు ముందే ఉంది. అయితే ఢిల్లీ లేకపోతే గల్లీ.. అలా బీజేపీ పోరుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పంచాయతీ పెట్టారు.

ఫామ్ హౌస్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీటింగ్ పెట్టిన కేసీఆర్… టీఆర్ఎస్ రాజకీయ పోరాటం ఎలా ఉండబోతోందో వారికి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనికి తోడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో.. కమలనాథులపై స్టాండ్ ఏమిటో పార్టీ పరంగా కూడా క్లారిటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా స్థాయిలో ఉన్న నేతలు.. ఇలా అందరినీ ఆహ్వానించారు.

ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాన్ని టార్గెట్ చేసేలా టీఆర్ఎస్ వ్యూహాన్ని తయారుచేసింది. నిజంగా ఇది మామూలుగా లేదు. కార్యకర్త నుంచి కేసీఆర్ వరకు అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆ స్కెచ్ ఉంది. వర్షాకాలానికి సంబంధించి 5.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు యాసంగిలో కోతకొచ్చిన 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లపై సందిగ్దం నెలకొంది. ఓ పదిరోజుల్లోపే ఆ ధాన్యమంతా చేతికొస్తుంది.

ఓ పది రోజుల్లో తెలంగాణ అంతా ధాన్యాగారంగా కనిపిస్తుంది. అదంతా అమ్ముడుపోకపోతే రైతులకు సమస్యలు తప్పవు. అది రాజకీయంగా టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతుంది. అందుకే ఆరునూరైనా సరే.. కేంద్రంతో ఆ ధాన్యాన్ని కొనిపించాలన్నది కేసీఆర్ ప్లాన్. కిందటిసారి ఢిల్లీకి వెళితే పీఎంతో పాటు కేంద్ర మంత్రులను కలవలేకపోయారు. అందుకే ఈసారి ముందే అపాయింట్ మెంట్ ను తీసుకోవాలనుకుంటున్నారు.

ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినా.. అనారోగ్య సమస్యతో కేసీఆర్ ఆయనను కలవలేకపోయారు. మరిప్పుడు వారి భేటీ ఎలాంటి ఫలితన్నిస్తుందో చూడాలి. అటు పార్లమెంట్ లో కూడా ధాన్యం కొనుగోళ్ల అంశంపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • delhi
  • telangana
  • trs

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd