Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఎన్నో రోజుల నుండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
- By Latha Suma Published Date - 07:28 PM, Thu - 1 August 24

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కి గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల అనంతరం నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కి గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. కప్ సాధించిన తర్వాత హైదరాబాద్ కి వచ్చిన సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. భారత జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండటం గర్వకారణం అని సీఎం ప్రశంసించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ కి సైతం ఇంటి స్థలం, గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.
Read Also: New Car Lunch : ఆగస్ట్‌లో విడుదల కానున్న టాప్ 5 కార్లు..!
అంతేకాక..కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్‌కి రికమండ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మూసీలో ఎప్పటికీ మంచి నీరు ఉండేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Read Also: Sleep: ఎక్కువసేపు నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?