Telangana Assembly Sessions : బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు?
- By Sudheer Published Date - 12:52 PM, Sun - 11 February 24

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Congress Govt Plans To Extend Telangana Assembly Sessions For Two Days) ఈనెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (సోమవారం) మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని చుస్తునారు. అంటే 14, 15 తేదీల్లోనూ సమావేశాలు నిర్వహించే అవకాశముందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె శనివారం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తుంటే..ప్రతిపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. తప్పుడు లెక్కలు చూపించారని బిఆర్ఎస్ , బిజెపి ఆరోపిస్తుంది. కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు లు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ దూరదృష్టితో కూడుకున్నదని, రాష్ట్ర ఆర్థిక పునర్జీవనానికి పునాదులు వేసేలా ఉందని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. గత పదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ హయాంలో నాశనం చేశారని మంత్రి ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బడ్జెట్లో నీటి పారుదల విభాగానికి రూ.28,024 కోట్లు కేటాయించడాన్ని మంత్రి స్వాగతించారు.
ఆరు గ్యారంటీల కోసం రూ.2.75 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో రూ.500లకే ఎల్పీజీ సిలిండర్‌ను అందజేస్తామన్న హామీలలో ఒకదానిని పౌర సరఫరాల శాఖ తమ పరిధిలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రక్రియలో గణనీయంగా దోహదపడుతున్న బడ్జెట్ అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమతూకం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.
Read Also : Water War : బీఆర్ఎస్‌తో ‘వాటర్ వార్’.. కాంగ్రెస్ ప్రత్యేక వర్క్‌షాప్