HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Assembly Brs Has No Respect For The Speaker Bhatti Fire

Telangana Assembly: బీఆర్ఎస్‌కు స్పీక‌ర్ ప‌ట్ల గౌర‌వం లేదు.. భట్టి ఫైర్!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లేకుండా భారీగా లోనులు తీసుకుని ఖజానాపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టం (FRBM) పరిధిలోనే లోనులు తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.

  • Author : Gopi Date : 17-12-2024 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Assembly
Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాపార సలహా కమిటీ (BAC) సమావేశాన్ని బహిష్కరించడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లో భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ పట్ల గౌరవం లేదని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్లకార్డులు ఎత్తి నిరసనలు వ్యక్తం చేయొద్దని పలు మార్లు విజ్ఞప్తి చేసినా విపక్ష సభ్యులు ఆగకపోవడం దారుణమన్నారు.

భట్టి విక్రమార్క ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తరచుగా పెండింగ్ బిల్లులను దశలవారీగా పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్‌లో ఉన్న డిస్కమ్ బిల్లులను తాము క్లియర్ చేశామని, అదనంగా డైట్ ఛార్జీలను కూడా పెంచినట్లు వివరించారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య లోన్ల విషయంలో మాటల యుద్ధం చోటు చేసుకుంది.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిమితులు లేకుండా భారీగా లోనులు తీసుకుని ఖజానాపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టం (FRBM) పరిధిలోనే లోనులు తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు.

Also Read: Allu Arjun Will Meet Pawan: ప‌వ‌న్‌ను క‌ల‌వ‌నున్న అల్లు అర్జున్‌.. షాక్ ఇవ్వ‌నున్న పోలీసులు!

అంతేకాకుండా తమ ప్రభుత్వం రూ.52 వేల కోట్ల అప్పు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో రూ.66 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఖర్చు రూపాయితో సహా లెక్కగట్టి చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.

వారి దొరతనం బయటపడింది: మంత్రి సీతక్క

బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప కేటీఆర్, హరీశ్‌రావు వేసుకోలేదు. అందులోనూ వారి దొరతనం బయటపడింది. నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వంలేదు. రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. వారి హయంలోనే రైతులకు దాదాపు పది సార్లు బేడీలు వేశారు’’ అని మండిపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs vs congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • telangana
  • Telangana Assembly
  • telugu news
  • Winter Assembly Sessions

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd