Telangana: కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
- By Praveen Aluthuru Published Date - 03:43 PM, Wed - 8 November 23

Telangana: సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ కు మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఈ రోజు సీఎం కేసీఆర్ కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్లో పర్యటించారు. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. సిర్పూర్‌లో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ ఛాపర్‌ను నిలిపివేశాడు. దీంతో రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ బయలుదేరారు.
ఈ సోమవారం సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబ్ నగర్ పర్యటనకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ బయలుదేరింది. అయితే హెలికాప్టర్ బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై వెంటనే అక్కడ సేఫ్ ల్యాండింగ్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఆయన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడం చర్చనీయాంశమైంది.
Also Read: KTR : యాంకర్ గా మారబోతున్న మంత్రి కేటీఆర్..? What An Idea Sirji !!