Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!
తెలంగాణలో టీడీపీకి మైలేజీ ఇచ్చే వ్యూహాన్ని సిద్ధం చేసే దిశగా రాజకీయ వ్యూహకర్తలు(Telangana TDP) ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 09:51 AM, Sun - 29 December 24

Telangana TDP : తెలంగాణ గడ్డపై టీడీపీ రీ ఎంట్రీ జరగనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే టీడీపీ రీఎంట్రీ ఏ జిల్లా నుంచి జరగబోతోంది అనే అంశం ప్రస్తుతం డిస్కషన్ పాయింట్‌గా మారింది. గతంలో టీడీపీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణపై చంద్రబాబు తొలి ఫోకస్ పెడతారా ? గతంలో దక్షిణ తెలంగాణలో టీడీపీ హవా వీచిన కీలక జిల్లాలను చంద్రబాబు ఎంచుకుంటారా ? అనే దానిపై చర్చ నడుస్తోంది.
Also Read :Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 47 మంది మృతి
తెలంగాణలో టీడీపీకి మైలేజీ ఇచ్చే వ్యూహాన్ని సిద్ధం చేసే దిశగా రాజకీయ వ్యూహకర్తలు(Telangana TDP) ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ తయారు చేసి ఇచ్చిన ప్రాథమిక నివేదికలు ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌లకు చేరాయనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో టీడీపీని మునుపటి స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం అనేలా ఆ నివేదికల్లో ఉందని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రీ ఎంట్రీ ఇస్తే టీడీపీకి కలిసొస్తుంది అనేది ఆ నివేదిక సారాంశమని చెబుతున్నారు. మొత్తంమీద 2028 లేదా 2029కల్లా తెలంగాణలో మళ్లీ క్షేత్రస్థాయి నుంచి టీడీపీని స్ట్రాంగ్ చేయొచ్చు అనే అంచనాలతో నివేదికలోని అంశాలు ఉన్నాయట.
Also Read :Sunrisers Team: నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టులో సంబరాలు
వీలైనంత త్వరగా తెలంగాణకు టీడీపీ అధ్యక్షుడిని నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తర్వాత టీడీపీ టార్గెట్ జోన్‌లో ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్ ఉన్నాయట. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణలో టీడీపీకి 15 దాకా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 2018లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే అయిదు సీట్లు వచ్చాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ బరిలోకి దిగే సూచనలు ఉన్నాయి. ఈ మూడు పార్టీల కూటమి తెలంగాణ గడ్డపై ఎలా వర్కౌట్ అవుతుందో వేచిచూడాలి.