HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tcongress Josh Bjp Leaders Set To Join Congress

TCongress: నాయకత్వ లేమితో బీజేపీ బేజార్, కీలక నేతల చూపు కాంగ్రెస్ వైపు!

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.

  • Author : Balu J Date : 26-09-2023 - 11:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajagopal Reddy
Rajagopal Reddy

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఓడించేందుకు ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం ఇటీవల తేల్చి చెప్పింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు తెలంగాణలో బిజెపి పూర్తిగా గందరగోళంలో పడింది. ‘‘కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యం పూర్తిగా లేకపోవడంతో నాయకత్వ లేమితో నిరుత్సాహానికి గురవుతున్నాం అని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ స్టేట్ మెంట్ తో రాజగోపాల రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీకి ఇకపై ఈ (సీఎంను ఓడించే) పరిస్థితి లేదనే భావన కిందిస్థాయి నేతల్లో నెలకొనడం గమనార్హం.

రాజ్‌గోపాల్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీలు విజయశాంతి, జి. వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ కూడా ఒకింత నిరాశతో ఉన్నట్టు సమాచారం. మరో 25 మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టడమే ఇప్పుడు పార్టీని కాపాడే ఏకైక మార్గం రాజ్‌గోపాల్ రెడ్డి అనేక సార్లు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవితపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీకి చేటు తెచ్చిపెట్టిందని, అధ్యక్ష బాధ్యతల నుంచి బండిని తప్పంచడం కూడా పెద్ద మైనస్ గా మారిందని రాజగోపాల్ రెడ్డితో ఇతర నాయకులు భావిస్తున్నారు.

గతంలో బిజెపికి 65 శాతం అధికార వ్యతిరేక ఓటు ఉంది. కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ ఓటింగ్ తగ్గబోతుందని నేతలు భవిస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో చాలా అసంతృప్తి ఉందని స్వయంగా నేతలు అంగీకరిస్తున్నారని కిందిస్థాయి నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంటే బీజేపీ నేతల్లో అయోమయం నెలకొనడం చర్చనీయాంశమవుతుంది.

Also Read: Harish Rao: గవర్నర్‌ గారు..ఇదేం పద్దతి? : మంత్రి హరీశ్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Telangana
  • hyderabad
  • komatiureddy rajagopal reddy
  • TCongress

Related News

Husband Fakes Kidnap

ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

అర్ధరాత్రి వచ్చిన యువతుల్లో ఒకరిని గుర్తించిన పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. పబ్‌లో చాలా రోజులుగా బెంగాలీ యువతితో పుర్ణచందర్ సహజీవనం చేస్తున్నాడని తెలిసింది

  • Uttam Kumar Reddy

    శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • New Liquor Brands

    మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు

  • Fire Incident In Maitrivana

    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్

  • Rowdy Sheeter Rapes A Minor

    మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

Latest News

  • సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ ప్రతీకార సుంకాలు బంద్

  • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

  • సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు పెరిగిన కష్టాలు!

  • రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్‌

  • రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..

Trending News

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd