Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 25-03-2024 - 11:31 IST
Published By : Hashtagu Telugu Desk
Talasani Srinivas Yadav: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్‌ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విజయలక్ష్మి తన మేయర్ పదవిని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌లో చేరాలని ఆసక్తిగా ఉన్నారని కేశవరావు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే గులాబీ పార్టీ కేశవరావు ముఖ్యమైన పదవులు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో కేకే పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. గులాబీ బాస్ ని కాదని ఆయన పార్టీ మారితే పరిస్థితులు ఎటు దారితీస్తాయో అన్న ఆలోచనలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కుమారుడు సాయికిరణ్ యాదవ్‌కు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంపై అసంతృప్తితో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇంకా బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరే వారిలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇందులో కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. కోనప్ప ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
Also Read: Mahakal Temple: ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి ఆలయంలో అగ్నిప్రమాదం