T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువతకు అండగా టీ- శాట్
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.
- By Gopichand Published Date - 11:29 PM, Sun - 24 November 24

T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువతకు టీ-శాట్ (T- SAT) నెట్వర్క్ అనునిత్యం అండగా నిలుస్తోంది. పోటీ పరీక్షలు ఏవైనా.. వాటికి యువతను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో అన్ని పోటీ పరీక్షలకూ ఉపయోగపడే కంటెంట్ ఈ నెల 25వ తేదీ సోమవారం నుండి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు టి-సాట్ (తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షకూ కంటెంట్ అందిస్తున్న టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నెట్వర్క్ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఎల్లవేళలా పోటీ పరీక్షల కంటెంట్ అందించిన ఏకైక సంస్థగా పేరుతెచ్చుకుందని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: IPL Auction Record: పంత్, అయ్యర్ లకు జాక్ పాట్.. ఐపీఎల్ వేలం విశేషాలీవే!
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు. టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నిపుణ ఛానల్ లో మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట, మూడు నుండి నాలుగు గంటల వరకు, విద్య ఛానల్ లో అదే రోజు రాత్రి ఎనిమిది నుండి 10 గంటల వరకు పున:ప్రసారమౌతాయన్నారు. పోటీ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టులైన తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్ట్రీ, మ్యాథ్స్, జాగ్రఫీ, పాలిటీ వంటి సబ్జెక్టులతో పాటు సోషల్ ఎక్స్ క్లూజన్, జనరల్ ఇంగ్లీష్ వంటి ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ పక్షాన తాము చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత తాము ప్రసారం చేసే పాఠ్యాంశాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. టి-సాట్(తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) ప్రసారాలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మంచి తోడ్పాటు అందించాయని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే తమ ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తున్నాయన్న ఆనందం కలుగుతోందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.