T Congress : `విక్రమార్క్`కాంగ్రెస్ మార్చ్! AICC ఆశీస్సులు!!
బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో భట్టీ విక్రమార్క్ పాదయాత్ర(T Congress) ప్రారంభం అయింది.
- By CS Rao Published Date - 03:48 PM, Thu - 16 March 23

బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామంలో సాయంత్రం 4 గంటలకు భట్టీ విక్రమార్క్ పాదయాత్ర(T Congress) ప్రారంభం అయింది. బోథ్ నుంచి ఖమ్మం వరకు మొత్తం 1,365 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర(peoples march) సాగనుంది. ఈ యాత్రను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రారంభించారు. తొలి రోజున పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడ బహిరంగ సభను పెట్టారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు చెందిన 39 నియోజకవర్గాల మీదుగా ఖమ్మంకు ఆయన పాదయాత్ర చేరుకోనుంది. 91 రోజుల పాటు కొనసాగి జూన్ 15న ఖమ్మంలో ముగుస్తుంది. అక్కడే భారీ బహిరంగ సభను నిర్వహించాలని బ్లూ ప్రింట్ తయారు అయింది. ప్రతి నియోజకవర్గంలో ఒక కార్నర్ మీటింగ్ నిర్వహించాలని కూడా అధిష్టానం ఆదేశించిందని తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా భట్టీ విక్రమార్క్ పాదయాత్ర రూపకల్పన జరిగింది. ఆయన యాత్ర హిట్ అయితే, రేవంత్ రెడ్డి సీఎం పదవి ఆశలకు కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా తెరపడినట్టేనని సీనియర్లు కొందరు భావిస్తున్నారు. అందుకే, భట్టీ పాదయాత్రకు సీనియర్లు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు కదులుతున్నారు.
భట్టీ విక్రమార్క్ పాదయాత్ర ప్రారంభం (T Congress)
రాష్ట్ర వ్యాప్తంగా(T Congress) 91 రోజుల పాటు నిర్విరామంగా సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క్ పాదయాత్ర (Peoples march) బ్లూ ప్రింట్ సిద్దమయింది. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా పీపుల్స్ మార్చ్ పేరుతో ఆయన మార్చి 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజుల పాటు. పాదయాత్ర చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి బుధవారం భట్టీ పాదయాత్ర ప్రారంభం అవుతోంది. గతంలో ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర చింతకాని మండలం తిమినేనిపాలెం వద్ద 213 కిలోమీటర్లు దాటిని విషయం విదితమే. ఇప్పుడు పీపుల్స్ మార్చ్ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశం మేరకు ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నారు. గతంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే తరహాలో ఆదేశాలతో ఉమ్మడి ఏపీలో ప్రజాప్రస్థానం యాత్ర చేసి సీఎం అయ్యారు. ఎలా అయితే, 2004 ఎన్నికలకు ముందుగా ఏఐసీసీ నుంచి ఆదేశాలు రాజశేఖర్ రెడ్డికి ఆనాడు అందాయో, ఆ విధంగా ఇప్పుడు భట్టీ విక్రమార్క్ అందుకున్నారు.
Also Read : Congress :`పీపుల్స్ మార్చ్`వెనుక ఢిల్లీ! వైఎస్ తరహాలో `భట్టీ`!
రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని రాజకీయ పండితుల సూత్రీకరణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రాఫ్ ను తగ్గించడానికి అలాంటి సూత్రీకరణను ఏఐసీసీ ఎంచుకుందని కాంగ్రెస్ (T Congress)వర్గాల్లోని టాక్. ఎందుకంటే, పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత సీనియర్లను కలుపుకుని పోలేకపోయారు. అంతేకాదు, వాళ్లను అప్పుడప్పుడు కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. వాళ్లను కేసీఆర్ కు కోవర్టులుగా చిత్రీకరించడంలో రేవంత్ వర్గీయులు సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో భట్టీ విక్రమార్క్ కూడా ఉన్నారని సర్వత్రా వినిపించింది. ఎందుకంటే, దళితబంధు పథకం గురించి చర్చించడానికి ప్రగతిభవన్ కు భట్టీ విక్రమార్క్ వెళ్లారు. ఆ భేటీని చూపుతూ చాలా రోజుల పాటు భట్టీని టార్గెట్ చేస్తూ రేవంత్ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా డ్యామేజ్ చేశారు.
రేవంత్ రెడ్డి భట్టీని పరోక్షంగా బలహీనపరుస్తూ..
పీసీసీ చీఫ్( T Congress) గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టీని పరోక్షంగా బలహీనపరుస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద రాజకీయ దాడికి దిగారు. వాళ్లు పార్టీ మారడానికి పరోక్షంగా భట్టీ చేతగానితనంగా క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తానని రేవంత్ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఎక్కడికక్కడ వాళ్లను చుట్టుముట్టాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఆ తరువాత వాళ్ల మీద న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఇటీవల ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్మేల కోనుగోలు కేసులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపును చేర్చాలని కోరారు. ఇలా పలు రకాలుగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి పోరాడారు. ఆయన చేసిన ఈ అంశాలన్నీ పరోక్షంగా సీఎల్పీ నేతగా ఉన్న భట్టీని బలహీనపరచడానికి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం భారీగా జరిగింది.
సీనియర్ల సహకారం తీసుకుని పాదయాత్రకు(Peoples march)
వివాదరహితునిగా ఉన్న భట్టీ విక్రమార్క్ ఖమ్మం కేంద్రంగా చేసుకుని పాదయాత్ర చేశారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రను కొనసాగించారు. రైతుల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా భట్టీ ఆయన నియోజకవర్గంలో పాదయాత్రకు దిగారు. తాజాగా హాత్ సే హాత్ జోడో యాత్ర అంటూ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మేరకు సానుకూల స్పందన వస్తున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం వ్యక్తిగత ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి చేస్తోన్న ప్రయత్నంగా కొట్టిపారేసిన సందర్బాలు అనేకం. పైగా ఆయన సీనియర్లను కాదని పాదయాత్రకు చేస్తున్నారని కూడా వాళ్లలో ఆగ్రహం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు భట్టి విక్రమార్క్ సీనియర్లందరి సహకారం తీసుకుని పాదయాత్రకు(Peoples march) శ్రీకారం చుట్టారు.
Also Read : Congress plenary : పొత్తులకు కాంగ్రెస్ పిలుపు! త్యాగాలకు సిద్ధమన్న ఖర్గే!!

Related News

Congress :`పీపుల్స్ మార్చ్`వెనుక ఢిల్లీ! వైఎస్ తరహాలో `భట్టీ`!
కాంగ్రెస్ పార్టీని(Congress) గాడిలో పెట్టేందుకు అధిష్టానం ప్లాన్ చేసి,