Congress :`పీపుల్స్ మార్చ్`వెనుక ఢిల్లీ! వైఎస్ తరహాలో `భట్టీ`!
కాంగ్రెస్ పార్టీని(Congress) గాడిలో పెట్టేందుకు అధిష్టానం ప్లాన్ చేసి,
- By CS Rao Published Date - 05:24 PM, Mon - 13 March 23

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని(Congress) గాడిలో పెట్టేందుకు అధిష్టానం పక్కా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే శాసనసభా పక్ష నేత భట్టీ విక్రమార్క(Batti vikramark) `పీపుల్స్ మార్చ్` పేరుతో పాదయాత్ర డిజైన్ జరిగిందని సమాచారం. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎవరి పరిధిలో వాళ్లు పాదయాత్రలు చేశారు. అలాగే, ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు కూడా పాదయాత్ర చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయితే, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పూర్తి భిన్నంగా స్కెచ్ వేసింది. రాబోవు రోజుల్లో సీఎం పదవిని ఎవరికి అప్పగించాలి? అనే కోణం నుంచి ముందుకు సాగుతోందని ఢిల్లీ వర్గాల వినికిడి.
తెలంగాణ కాంగ్రెస్ ని గాడిలో పెట్టేందుకు అధిష్టానం ప్లాన్(Congress)
తెలంగాణ సీఎం కావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెబుతున్నారు. అంతేకాదు, ఎక్కడకు వెళ్లినప్పటికీ ఆయనకు ఉండే ప్రత్యేక టీమ్ `సీఎం..సీఎం` అంటూ నినాదాలు చేస్తుంటారు. ఇదంతా ఒక వ్యూహంగా కాంగ్రెస్(Congress) అధిష్టానం చత్తీస్ గడ్ ప్లీనరీ సందర్భంగా గుర్తించిందట. ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి హవాకు క్రమంగా చెక్ పెట్టాలని వ్యూహాన్ని రచించినట్టు పార్టీలోని అంతర్గత వర్గాల బోగట్టా. అందుకే, ఇప్పుడు భారీ పాదయాత్ర దిశగా భట్టీ విక్రమార్క్ (Batti Vikramark)ను రంగంలోకి దింపిందని తెలుస్తోంది. ఈనెల 16వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. జూన్ 15వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. మొత్తం 91 రోజులు 39 నియోజకవర్గాల్లో సుమారు 1365 కిలోమీటర్ల యాత్రకు బ్లూ ప్రింట్ సిద్ధమయింది. ఇది సక్సెస్ అయితే, మరిన్ని రోజులు, నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్రను కొనసాగించే అవకాశం ఉంది.
Also Read : T Congress : దిగ్విజయ్ సింగ్‌తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ
`రెడ్డి` సామాజికవర్గానికి రాజ్యాధికారం ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని గత ఏడాది కార్తీక సమారాధన సందర్భంగా చెప్పారు. అంతేకాదు, కాంగ్రెస్ లోని(Congress) సీనియర్లను పరోక్షంగా హోంగార్డులుగా, తాను ఐపీఎస్ గా పోల్చుకున్నారు. వీటితో పాటు సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య వార్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దడానికి వచ్చిన థాక్రే, రోహిత్ చౌదరి, జావెద్ తదితరులు క్షేత్రస్థాయి నివేదికను తయారు చేశారట. రాబోవు రోజుల్లో రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో పార్టీని వదిలేస్తే మరో జగన్మోహన్ రెడ్డిలాగా తెలంగాణలో కాంగ్రెస్ కు ఏకుమేకవుతారని ఆ నివేదికలోని సారంశమని తెలుస్తోంది. అందుకే, ఎల్ బీ నగర్ నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నప్పటికీ కొండంగల్ నుంచి మాత్రమే రంగంలోకి దిగాలని అధిష్టానం సంకేతాలు ఇచ్చిందని గత వారం రోజులుగా చర్చ జరుగుతోంది.
అధిష్టానం సంకేతం మేరకు పీపుల్స్ మార్చ్ వైపు భట్టి విక్రమార్క్
అధిష్టానం ఇచ్చిన సంకేతం మేరకు పీపుల్స్ మార్చ్ వైపు భట్టి విక్రమార్క్(Batti Vikramark) ముందుకు కదులుతున్నారు. సహచర సీనియర్ల ఆశీస్సులను తీసుకుంటున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి , హనుమంతరావు తదితరులను కలుసుకుంటున్నారు. పాదయాత్రకు మద్ధతును కూడగట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ నియోజకవర్గం పరిధిలో జరిగే ప్రారంభ సభ ను లక్ష మందితో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు కీలక లీడర్లు హాజరు కానున్నారు. అంతేకాదు, భట్టీ చేసే పీపుల్స్ మార్చ్ యాత్రలో ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రను విలీనం చేయడానికి కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి ముందుకొచ్చారు. డిప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనరసింహా, శ్రీథర్ బాబు తదితరులు భట్టీ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఏఐసీసీ (Congress) ప్లాన్ ప్రకారం చేస్తోన్న కార్యక్రమంగా పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు.
Also Read : Revanth Reddy@72: కాంగ్రెస్ కు 72 సీట్లు ఖాయం.. రేవంత్ రెడ్డి ధీమా!
సేమ్ టూ సేమ్ 2004 ఎన్నికలకు ముందుగా రాజశేఖర్ రెడ్డికి పరోక్షంగా ఎలా సహకారం ఏఐసీసీ ఇచ్చిందో, అలాగే భట్టి విక్రమార్క్ (Batti Vikramark)కు అన్ని రకాలుగా అండగా నిలవనుందని తెలుస్తోంది. అందుకే, సీనియర్లు కూడా భట్టీని కాదనకుండా పీపుల్స్ మార్చ్ ను విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా భట్టీ తో కలిసి నడుస్తానంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే, పీపుల్స్ మార్చ్ పూర్తిగా రేవంత్ రెడ్డికి ఏఐసీసీ (Congress)అవకాశం ఇస్తుందా? అనేది పెద్ద ప్రశ్న.
రేవంత్ రెడ్డి ఇస్తోన్న హామీలపై అధిష్టానం ఆరా
ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇస్తోన్న హామీలపై అధిష్టానం ఆరా తీస్తోంది. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి ప్రముఖంగా ప్రకటించారు. కానీ, ఇటీవల తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్ జయరాం రమేష్ మాత్రం పాక్షికంగా మాత్రమే పోర్టల్ ను మర్పులు చేస్తామని చెప్పారు. ఇలా, పలు విషయాల్లో రేవంత్ రెడ్డి హామీలకు, అధిష్టానం ఆలోచనకు భిన్నంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ భావిస్తోందట. అందుకే, ఆయన దూకుడును తగ్గించడంతో పాటు భవిష్యత్ లో పార్టీని తమ చేతుల్లోనే ఉంచుకోవాలని మాస్టర్ స్కెచ్ వేస్తూ `భట్టీ`ని (Batti Vikramark)రంగంలోకి దింపిందని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read : Congress: పట్టణాల్లో కాంగ్రెస్ వీక్ , గ్రామాల్లో భేష్! లండన్ వేదికపై రాహుల్ లెక్క

Tags
- batti vikramarka
- Congress President Mallikarjun Kharge
- EX cm ysr
- padayathra
- revanth reddy
- telangana congress

Related News

KTR: రేవంత్, బండి సంజయ్ పై కేటీఆర్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా.. వారం రోజులే గడువు..!
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును మంగళవారం అందజేశారు.