HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sukesh Chandrasekhar Releases Screenshots Of Whatsapp Chat With Kavitha

MLC Kavitha: సుఖేష్ లీక్స్… కవిత చాటింగ్ వైరల్

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 12-04-2023 - 3:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

MLC Kavitha: మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు. ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా ఈ తతాంగం నడుపుతున్నాడు.

దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం ప్రస్తుతం ఈడీ చూస్తుంది. లిక్కర్ స్కాములో నిందితులని, అనుమానితులని ఇప్పటికే పలు మార్లు విచారించింది. ఈ క్రమంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని కస్టడీకి తీసుకుంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. అయితే ఈ కథలో మనీలాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కవిత హస్తం ఉందంటూ వార్తల నేపథ్యంలో సుఖేష్ చాటింగ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్ జైలుకెళ్లాడు. అయితే తన తరుపు లాయర్ ద్వారా కవితతో చేసిన చాటింగ్ వివరాలను లీక్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు ఆధారాలు బయటపెట్టగా నేడు మరో బాంబ్ పేల్చాడు.

సుఖేష్ బయటపెట్టిన స్క్రీన్ షాట్ లో కవిత అక్క టీఆర్ఎస్ అనే పేరుతో కాంటాక్ట్ సేవ్ అయి ఉంది. ఈ వాట్సాప్ చాటింగ్ కోడ్ భాషతో సాగింది. పలు మార్లు అక్క అక్క అంటూ చాటింగ్ సాగింది. డబ్బు డెలివరీ చేశానంటూ చాటింగ్ లో పేర్కొన్నాడు. గతంలో కూడా సుఖేష్ పలు చాటింగ్ వివరాలను బయటపెట్టాడు. అందులో కూడా కోడ్ భాషనే వాడారు. ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఎస్ జే అంటే సత్యేంద్రజైన్ .. మనీష్ అంటే మనీష్ సిసోడియా.. అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని.. జేహెచ్ అంటే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద టీఆర్ఎస్ అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని కోడ్ వాడినట్టు సుఖేష్ తెలిపాడు.

Read More: Kavitha Injured: కవిత కాలికి గాయం.. మూడు వారాలు రెస్ట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Delhi Liquor scam
  • MLC Kavitha
  • Money Laundering
  • sukesh chandrasekhar

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd