HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Students Success Depends On Technology Minister Duddilla Sridhar Babu

Minister Sridhar Babu: విద్యార్థుల విజయం టెక్నాలజీతోనే: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

విద్యార్థులు విజయం సాధిస్తే టీచర్లు, ఆ తర్వాత తల్లిదండ్రులు సంతోషిస్తారని, కేవలం చదువుల్లో మొదటి స్థానమే కాకుండా, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం చాలా ముఖ్యం అని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

  • Author : Gopichand Date : 13-11-2025 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Sridhar Babu
Minister Sridhar Babu

Minister Sridhar Babu: విద్యార్థులు జీవితంలో సక్సెస్ (విజయం) సాధించాలంటే తప్పనిసరిగా టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం సంపాదించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సూచించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల టి-సాట్ (T-SAT) కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు-2025’ విజేతల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: మంత్రి

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సమాజంలో అత్యంత వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ప్రస్తుత కాలంలో విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా వేయలేకపోతున్నామని, వారి మేధో సంపత్తికి టి-సాట్ సాంకేతికతను ఉపయోగించుకుని తమ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలని సూచించారు.

Also Read: Sania Mirza: సానియా మీర్జాకు అరుదైన వ్యాధి.. అది ఏంటంటే?

విద్యార్థులు విజయం సాధిస్తే టీచర్లు, ఆ తర్వాత తల్లిదండ్రులు సంతోషిస్తారని, కేవలం చదువుల్లో మొదటి స్థానమే కాకుండా, ఇలాంటి పోటీల్లో పాల్గొనడం చాలా ముఖ్యం అని మంత్రి అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

టి-సాట్ పోటీల్లో విజేతలైన 99 మంది విద్యార్థులు, సుమారు 2,200 మంది విద్యార్థుల నాలెడ్జ్‌తో సమానం అని మంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. అందుకే తమ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, డిజిటల్ విద్యలో టి-సాట్ అందిస్తున్న సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు మారుమూల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

99 మంది విద్యార్థులకు సన్మానం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘రాష్ట్ర స్థాయి వార్షిక పోటీలు 2025’ పేరుతో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు గురువారంతో ముగిశాయి. మండల, జిల్లా, జోనల్ స్థాయిలలో నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వక్తృత్వ పోటీల్లో ప్రథమ విజేతగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థి కె.కేశవర్థన్ నిలిచారు. ద్వితీయ స్థానంలో మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన కె.వి.యషశ్విని, తృతీయ స్థానంలో నిర్మల్ జిల్లాకు చెందిన వంగా వెంకటకృష్ణ నిలిచారు.

వ్యాస రచన పోటీల్లో ప్రథమ విజేతగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టి.హర్షిత, ద్వితీయ విజేతగా నారాయణపేట జిల్లాకు చెందిన ఎం.కీర్తన, తృతీయ స్థానంలో మేడ్చల్ జిల్లాకు చెందిన డి.తేజస్విని గెలుపొందారు. క్విజ్ పోటీల్లో ఈ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జోన్ ప్రథమ విజేతగా, కాలేశ్వరం జోన్ ద్వితీయ విజేతగా, బాసర జోన్ మూడవ స్థానంలో నిలిచింది. జోగులాంబ గద్వాల జోన్ ప్రత్యేక విజేతగా నిలిచింది.

ఈ సందర్భంగా టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు టి-సాట్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు ప్రతి రోజూ కనీసం గంట పాటు టి-సాట్ నెట్‌వర్క్‌ను చూడాలని సూచించారు. పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ టి-సాట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌లను అందజేసి ప్రోత్సహించింది. తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, టి-సాట్ కార్యక్రమాలను విద్యార్థులకు అందించేందుకు తమ బాధ్యతను నిర్వర్తిస్తామని హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Government School Students
  • Minister Sridhar Babu
  • Proficiency
  • T-SAT Platform
  • technology

Related News

    Latest News

    • మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

    • ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 విజేత ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?!

    • శ్రీశైలం ప్రసాదంలో రసాయనాలు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

    • సుమతీ శతకం మూవీ రివ్యూ

    • టీ-20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియాకు భారీ షాక్!

    Trending News

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

      • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd