HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Steps For A Political Party To Be Registered As National Party Brs To Trs

BRS Party : జాతీయ పార్టీ హోదా `బీఆర్ఎస్`కు ఎండ‌మావే!

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఢిల్లీ కేంద్రంగా జ‌రుగుతోంది. స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవ తీర్మానం త‌రువాత బుధ‌వారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే

  • Author : CS Rao Date : 06-10-2022 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRA alliance
Kcr Ec Brs

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఢిల్లీ కేంద్రంగా జ‌రుగుతోంది. స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఏక‌గ్రీవ తీర్మానం త‌రువాత బుధ‌వారం టీఆర్ఎస్ ను క్లోజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. జెండా, చిహ్నం, రంగును య‌థాత‌దంగా ఉంచుతూ ఎజెండాను మార్చేయ‌బోతున్నారు. అందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద ఢిల్లీ కేంద్రంగా రిజిస్త్రేష‌న్ ప్రక్రియ జ‌రుగుతోంది.

ఇలాంటి సంద‌ర్భంంలో జాతీయ పార్టీ స్థాపించడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? విధి విధానాలేమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు అనే అంశంపై విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండేలా రూపొందించిన రాజ్యాంగం మ‌నది. ప్ర‌స్తుతం దేశంలో ఉన్న పార్టీలను జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకొవ‌చ్చు. ఇవే కాకుండా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ పార్టీలు అనేకం ఉన్నాయి.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..?
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు)సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా గెల‌వాలి.
(లేదా)
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
(లేదా)
గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి.
ప్రాంతీయ పార్టీ గుర్తింపు
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
(లేదా)
లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
అయితే, ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు.అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది.దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.

దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు
2021 సెప్టెంబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి.
1.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
2.భారతీయ జనతా పార్టీ (BJP)
3.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – (CPI)
4.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – (CPI(M))
5.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)
6.బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP)
7.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)
8.నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)

రిజిస్టర్డ్‌ పార్టీలు
జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్‌ పార్టీలుగా పరిగణిస్తారు.కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసన ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి. 50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి. 20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం 2 స్థానాల్లో పోటీ చేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం భారత్ రాష్ట్ర సమితి (BRS) ని‌ ఎన్నికల‌ సంఘం గుర్తిస్తే వచ్చేది‌ రిజిస్టర్డ్ పార్టీ హోదా మాత్రమే. జాతీయ పార్టీ కాదని గుర్తుంచుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • election commission of india
  • KCR national party
  • ts cm kcr

Related News

Kcr

Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు

KCR తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొ

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

Latest News

  • Nirmala Sitharaman Saree: ఈసారి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ చీర ఎంతో ప్రత్యేకం !!

  • Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఎలా ఉండబోతుందో ?

  • Medaram : మేడారంలో చేతులెత్తేసిన ఆర్టీసీ, మంత్రి పొన్నం పై భక్తుల ఆగ్రహం

  • రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు

  • బిల్ గేట్స్‌కు ఆ వ్యాధి సోకిందా? వారితో శృంగారమే కారణమా ?

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd