TG : నా భూతొ న భవిష్యత్ అనే రేంజ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – సీఎస్ శాంతికుమారి
జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని పేర్కొన్నారు.
- By Sudheer Published Date - 07:36 PM, Mon - 27 May 24

జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని CS శాంతికుమారి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో ఈరోజు సోమవారం సీఎస్ సమీక్ష నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 2న ఉదయం గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారని , అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. జూన్ 2 రాత్రి 7 గంటల నుండి 9 వరకు ట్యాంక్ బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 5 వేల మంది శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని , ట్యాంక్ బండ్‌పై హస్త కళలు, చేనేత కళలు స్టాళ్లు, స్వయం సహాయక బృందాల స్టాళ్లు, నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలతో పాటు, బాణాసంచా, లేజర్ షో ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు.
మరోపక్క రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. అందులో కొన్ని మార్పులు చేయాలని చిత్రకారుడు రుద్రరాజేశంకు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉండగా ఇప్పటి లోగోలో ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని సీఎం చెప్పినట్లు సమాచారం. కొత్త చిహ్నాన్ని జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తారు.
Read Also : Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా