Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా
ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు
- By Sudheer Published Date - 06:14 PM, Mon - 27 May 24

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజెపి అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా (Amith Shah)..తన దూకుడు ను కొనసాగుతూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు దశల్లో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా..జూన్ 1 న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అమిత్ షా..ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల పోలింగ్ లో బిజెపి పార్టీ కి ప్రజలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఎద్దేవా చేసారు. ఈ ఎన్నికలు రామభక్తులపై కాల్పులు జరిపిన వారికి, రామమందిరం కట్టిన వారికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అవినీతిలో కూరుకుపోయిన ఎస్పీ, యూపీఏ ప్రభుత్వాలు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డాయని తెలిపారు. 25 ఏళ్లు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ 25 పైసల అవినీతి ఆరోపణలు లేని ప్రధాని మోడీ అని ప్రశంసించారు. ఎస్పీ హయాంలో ఆరు వేల కోట్ల పీఎఫ్ కుంభకోణం, రూ.1500 కోట్ల గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణం, ల్యాప్ టాప్ స్కాం, నోయిడా భూకేటాయింపుల కుంభకోణం, పోలీస్ రిక్రూట్ మెంట్ స్కాం, జల్ నిగమ్ కుంభకోణం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం నుంచి ఆకాశం వరకు మోసాలు మాత్రమే చేసిందని అమిత్ షా విమర్శించారు.
Read Also : Rahul Gandhi : రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..