TS SSC Exam Date 2024: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం పదవ తరగతి పరీక్షలు
- Author : Praveen Aluthuru
Date : 30-12-2023 - 9:59 IST
Published By : Hashtagu Telugu Desk
TS SSC Exam Date 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం పదవ తరగతి పరీక్షలు మార్చి 18 సోమవారం ప్రారంభమవుతాయి. చివరి పేపర్ మంగళవారం ఏప్రిల్ 2 న నిర్వహించబడుతుంది.
పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. అభ్యర్థులందరూ తమ తమ పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూసుకోవాలని అధికారులు సూచించారు. టైమ్ టేబుల్‌లో పేర్కొన్న ఏదైనా తేదీలలో ప్రభుత్వం పబ్లిక్ హాలిడే లేదా సాధారణ సెలవులు ప్రకటించినప్పటికీ టైమ్ టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా జనవరి 10 నాటికి సిలబస్‌ను పూర్తి చేయాలని, వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రత్యేక తరగతులను పరీక్షల వరకు పొడిగించాలని విద్యాశాఖ ఆదేశించింది.
మార్చి 18 నుంచి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 18న ఫస్ట్ లాంగ్వేజ్, ఫిబ్రవరి19న సెకండ్ లాంగ్వేజ్, ఫిబ్రవరి21న ఇంగ్లిష్, ఫిబ్రవరి 23న మ్యాథ్స్, ఫిబ్రవరి 26న సైన్స్ మొదటి పేపర్, ఫిబ్రవరి 28న సైన్స్ రెండవ పేపర్, ఫిబ్రవరి 30న సోషల్ స్టడీస్, ఫిబ్రవరి 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్, ఫిబ్రవరి 2న రెండవ పేపర్ పరీక్షలు జరుగుతాయి.మొత్తం ఏడు రోజులపాటు పరీక్షలను నిర్వహించనున్నారు
Also Read: CM Revanth Reddy: ప్రైవేట్ వర్సిటీల రిజర్వేషన్ విధానంపై విచారణ.