CM Revanth: సోనియా జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ!
గాంధీభవన్ ఆవరణలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి.
- By Balu J Published Date - 11:13 AM, Sat - 9 December 23

CM Revanth: గాంధీభవన్ ఆవరణలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సోనియమ్మ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియానుద్దేశించి మాట్లాడారు. శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని, డిసెంబర్ 9, 2019లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని ఆయన గుర్తు చేశారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చారని, తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆమెను కొనియాడారు.
తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారని సీఎం అన్నారు. సేవకుడిగా ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాది అని, ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని రేవంత్ అన్నారు.
Also Read: Leopard: కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం, రైతు పై దాడి!