HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Software Employee Commits Suicide Just One Month After Love Marriage

ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Software employee Ishika Yadav
Software employee Ishika Yadav

 Ishika Yadav  హైదరాబాద్‌లో మరో టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. 5 ఏళ్లుగా ప్రేమించుకుని ఇటీవలనే పెళ్లి చేసుకోగా, 50 రోజుల్లోనే ఆ యువతి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరి రాష్ట్రాలు వేరైనా ప్రేమ విషయం ఇళ్లల్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో ఊహించని విషాదం నెలకొంది. భర్త వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు కుటుంబాలకు ఇది తీరని శోకంగా మారింది.

ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని.. నూరేళ్ల పాటు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని భావించిన చాలా జంటలు.. పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పడటం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, హత్యలు, ఆత్మహత్యలు వంటి ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు ఇష్టంగా, ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వారు కూడా పెళ్లి తర్వాత తమ మనసులు, అభిప్రాయాలు మార్చుకుని.. ఎంత ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ద్వేషించుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం.. ఆ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ప్రేమికులను చేసింది. 5 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన 50 రోజుల్లోనే యువతి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఇషిక యాదవ్‌ అనే యువతి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 5 ఏళ్ల క్రితం ఆమె బిహార్‌లో ఉండగా.. ఫేస్‌బుక్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్‌ బన్సాల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నీరజ్‌ బన్సాల్ కూడా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో స్నేహితులైన ఇషిక యాదవ్, నీరజ్ బన్సాల్.. ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ తమ ప్రేమ విషయాన్ని వాళ్ల ఇళ్లల్లో చెప్పి.. కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ఇషిక యాదవ్, నీరజ్ బన్సాల్‌ల వివాహం జరిగింది.

ఇక పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్‌‌కు వచ్చేసి ఉద్యోగం చేస్తున్న ఇషిక యాదవ్, తన భర్త నీరజ్ బన్సాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే వీరికి పెళ్లయి సరిగ్గా 50 రోజులు పూర్తికాగా, బుధవారం రోజున ఇషిక యాదవ్ తమ ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఆఫీస్‌కు వెళ్లి ఇంటికొచ్చిన భర్త నీరజ్ బన్సాల్, ఇషిక యాదవ్‌ ఉరి వేసుకోవడం చూసి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించాడు. అయితే అప్పటికే ఇషిక యాదవ్ చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇషిక యాదవ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇషిక యాదవ్ కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. అయితే అదనపు కట్నం కోసం భర్త నీరజ్ బన్సాల్ తమ కుమార్తె ఇషిక యాదవ్‌ను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Ishika Yadav
  • love marriage
  • Married woman commits suicide
  • Miyapur
  • Neeraj Bansal
  • software employee

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd