HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Annamalai Resigns From Bjp

Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 02-06-2026 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Annamalai Resigns From Bjp
Annamalai Resigns From Bjp

తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. అయితే, పార్టీలో తనకు సరైన అవకాశాలు లభించడం లేదని, ముఖ్యంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ, దానిని ఆయన తిరస్కరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, బీజేపీ కూటమి పరిమిత స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత పార్టీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు పెరిగాయి.

రాజీనామా అనంతరం అన్నామలై వెంటనే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో లేరని, జాతీయవాద భావజాలంతో తొలుత ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి, భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా, చెన్నైలో ఆయన మద్దతుదారులు ఇప్పటికే భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • annamalai
  • bjp party
  • BJP resign
  • Nitin Nabin
  • tamil nadu politics

Related News

    Latest News

    • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

    • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

    • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

    • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

    • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd