HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Slbc Tunnel Rescue Operation Relief Measures This Is The Update

SLBC Tunnel Rescue: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు.. అప్డేట్ ఇదే!

రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటుఢిల్లీ నుండి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, SLBC టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కొరకు హైదరాబాద్ కు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు.

  • Author : Gopi Date : 05-03-2025 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SLBC Tunnel Incident
SLBC Tunnel Incident

SLBC Tunnel Rescue: బుధవారం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ (SLBC Tunnel Rescue) ఆపరేషన్‌లో సహాయక చర్యలను సమీక్షించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సహాయక బృందాలు కొనసాగిస్తున్న పనులను విభాగాల వారీగా విశ్లేషించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కల్నల్ పరీక్షిత్ మెహర టన్నెల్ బోరింగ్ మెషిన్ నమూనా తో అధికారులకు టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు.

టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగంలోనీ శిథిలాలను తొలగించడం జరిగిందని, రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తూ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ గుర్తించిన సర్ఫేస్ డిస్టర్బెన్స్ ప్రాంతాలలో మట్టితీత పనులు వేగంగా జరుగుతున్నాయని, ది వాటరింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు సమన్వయంతో నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించారు.

Also Read: LG : స్మార్ట్ టివిల కోసం 100కి పైగా ఛానల్స్ ను తీసుకువచ్చిన LG ఛానల్స్

రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న సహాయక బృందాలు తోపాటుఢిల్లీ నుండి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం, SLBC టన్నెల్ ప్రమాద ప్రదేశంలో రోబోటిక్ సేవల కొరకు హైదరాబాద్ కు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్లోకి వెళ్లినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎడమవైపు నుండి వాటర్ జెట్ ల ద్వారా బురదను తొలగించే పనులు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాల ద్వారా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. టన్నెల్ లో పల ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ పై పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు వాటర్ జెట్ ల ను ఉపయోగించుకున్నట్లు వాటి పని తీరును అధికారులకు డెమో ద్వారా వివరించారు.

కన్వేయర్ బెల్టు పునరుద్ధరించామని దానికి సంబంధించిన కమీషనింగ్ పని పూర్తి చేస్తున్నట్లు, రెస్క్యూ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న ఆటంకాలను అధిగమిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. టన్నెల్ లోపల వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలను ముందుకు పొడిగించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లక్నో డైరెక్టర్ అయోధ్య ప్రసాద్ తప్లియాల్,, హైదరాబాదు డైరెక్టర్ శైలేంద్ర కుమార్, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మెకానికల్ ఇంజనీర్ మురళీ, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • SLBC
  • SLBC Tunnel
  • SLBC Tunnel Rescue
  • SLBC Tunnel Rescue Operation
  • telangana
  • telugu news
  • Tunnel

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd